News April 9, 2025

నేడే పేట జిల్లా బీజేపీ అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం

image

నారాయణపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కె. సత్య యాదవ్ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ రానున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ఉదయం 10 గంటలకు మెట్రో గార్డెన్‌లో ప్రమాణస్వీకారం ఉంటుందని తెలిపారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Similar News

News February 25, 2026

‘దేవాదుల’ కెపాసిటీని 100TMCలకు పెంచండి: సీఎం రేవంత్

image

TG: ములుగు(D)లోని దేవాదుల ఎత్తిపోతల పథకం కెపాసిటీని భవిష్యత్తులో 100 TMCలకు పెంచేందుకు కసరత్తు చేయాలని CM రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును 38TMCల సామర్థ్యంతో 5.57 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించేలా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ₹14,359Crను ఖర్చు చేశారు. దేవాదులతో హనుమకొండ, వరంగల్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, భువనగిరి, ములుగు జిల్లాల రైతులకు లబ్ధి చేకూరనుంది.

News February 25, 2026

కొత్త పెన్షన్లపై శుభవార్త

image

AP: కొత్త పింఛన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మార్చిలో 8,977 స్పౌజ్ పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. మార్చి 1న సండే కావడంతో FEB 28నే పెన్షన్లు <<19230790>>అందజేయనున్నట్లు<<>> ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తంగా 62.76L మందికి ₹2,725Crను పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. వృద్ధులు, వితంతువులకు ₹4K, దివ్యాంగులకు ₹6K, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు ₹10K, మంచానికే పరిమితమైన వారికి ₹15K ఇస్తున్న విషయం తెలిసిందే.

News February 25, 2026

నల్గొండ: అంగన్‌వాడీలపై ‘సర్పంచ్’ పెత్తనమేంటి?

image

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతలను సర్పంచులకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో రాజకీయ జోక్యం పెరిగి, చిన్న కారణాలతో కార్యకర్తలు వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. రాజకీయ వర్గపోరు వల్ల కేంద్రాల పనితీరు దెబ్బతింటుందని, ప్రస్తుతం అధికారుల పర్యవేక్షణలోనే సేవలు సక్రమంగా అందుతున్నాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి.