News March 19, 2025

నేడే రాష్ట్ర బడ్జెట్..KMR జిల్లా ప్రజల బడ్జెట్‌పై ఆశలు..!

image

రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పైనే జిల్లా ప్రజలు ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు నిధుల లేమితో సంవత్సరాల తరబడి ప్రాజెక్టుల పనులు పూర్తికావడం లేదు. శతాబ్దాల చరిత్ర కలిగిన కౌలాస్ కోట మరుగున పడి చరిత్రలో కలిసిపోవడానికి రెడీగా ఉంది. అలాగే కాళేశ్వరం 22వ ప్యాకేజీ పనులకు నిధుల గండం పడుతోంది. బడ్జెట్‌లో వీటిపై ఏ స్థాయిలో ప్రాధాన్యత ఉంటుందో చూడాలి. 

Similar News

News July 7, 2025

వికారాబాద్: మార్పు రావాలి.. రక్షణ కావాలి!

image

అనంతగిరి.. చుట్టూ అడవులు, పెద్ద సరస్సులు కలిగిన పర్యాటక ప్రాంతం. బోటింగ్, ట్రెక్కింగ్ కోసం ఇక్కడికి టూరిస్టులు తరలివస్తుంటారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ టూర్‌ విషాదాన్ని నింపుతోంది. 2023లో కోట్‌పల్లి ప్రాజెక్ట్‌లో ఈతకోసం దిగి ముగ్గురు యువకులు మృతి చెందగా.. ఇటీవల సర్పన్‌పల్లి ప్రాజెక్టులో ఇద్దరు మహిళలు చనిపోయారు. రక్షణ చర్యలు పటిష్టం చేస్తే ప్రాణ నష్టం జరగదని టూరిస్టుల మాట. దీనిపై మీ కామెంట్?

News July 7, 2025

చింతపల్లి: పాఠశాల పైకప్పుపై టార్పాలిన్ కవర్లు

image

చింతపల్లి మండలం చౌడురాయిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుకుంది. వర్షాలు కురిసినప్పుడు తరగతి గదులు, వరండాల్లో వాన నీటితో నిండిపోతుంది. ఇలా నీటిలోనే విద్యార్థులు విద్యను అభ్యసించడంతో తల్లిదండ్రులు పైకప్పుపై టార్పాలిన్ కవర్లను వేసి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించారు. సుమారు 30 ఏళ్ల క్రితం పాఠశాల భవనం నిర్మించారని, మరమ్మతులు చేపట్టాలని వారు కోరుతున్నారు.

News July 7, 2025

కాకినాడ JNTUకు కొత్త అధికారులు

image

కాకినాడ జేఎన్టీయూ ఇన్‌ఛార్జ్ రెక్టార్, రిజిస్ట్రార్‌లను నియమిస్తూ ఆదివారం ఉత్తర్వులు వెలువడ్డాయి. యూసీఈకే ఈఈఈ విభాగంలో పనిచేస్తున్న శ్రీవినాసరావు ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో పనిచేస్తున్న సుబ్బారావు ఇన్‌ఛార్జ్ రెక్టార్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు వారిని వీసీ ప్రసాద్ అభినందించారు.