News April 23, 2025

నేడే రిజల్ట్.. సత్యసాయి జిల్లా విద్యార్థుల ఎదురుచూపు

image

పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. నేడు ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో 23,730 మంది విద్యార్థులు ఉన్నారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.
☞ వే2న్యూస్ యాప్‌లోనూ ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

Similar News

News April 23, 2025

జగన్‌ను కలిసిన కడప నేతలు

image

మాజీ సీఎం జగన్‌ను కడప జిల్లా వైసీపీ నేతల కలిశారు. తాడేపల్లిలోని మాజీ సీఎం నివాసంలో ఇవాళ సమావేశం జరిగింది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇతర నాయకులు అక్కడికి వెళ్లారు. పీఏసీలో తనకు చోటు కల్పించడంపై జగన్‌కు అంజద్ బాషా ధన్యవాదాలు తెలిపారు. 

News April 23, 2025

ఇవాళ కశ్మీర్ బంద్.. అన్ని పార్టీల మద్దతు

image

ఉగ్రదాడికి నిరసనగా ఇవాళ జమ్మూకశ్మీర్‌లో బంద్‌కు JKHC, CCIK, ట్రావెల్, ట్రేడ్ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనికి అధికార నేషనల్ కాన్ఫరెన్స్‌తో పాటు పీడీపీ, ఇతర పార్టీలు కూడా మద్దతిచ్చాయి. మృతులకు నివాళిగా పలు ప్రాంతాల్లో క్యాండిల్‌లైట్లతో నిరసన తెలపనున్నాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరాయి.

News April 23, 2025

కొండగట్టు: మే 20 నుంచి 23 వరకు పెద్ద జయంతి ఉత్సవాలు

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో మే 20 నుంచి 23 వరకు పెద్ద జయంతి ఉత్సవాలు నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు. కావున ఇప్పటినుంచే భక్తులు, దీక్షాపరులు అధికసంఖ్యలో విచ్చేసే అవకాశం ఉన్నందున ఏప్రిల్ 23 నుంచి వాహనాలను దేవాలయం వరకు వెళ్లకుండా ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశామన్నారు. దీనికి భక్తులు సహకరించాలని కోరారు.

error: Content is protected !!