News October 7, 2025
నేడే సిరిమానోత్సవం

ఉత్తరాంధ్ర ఇలవేల్పు కోరిన కోర్కెలు తీర్చే శ్రీపైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈరోజు అంగరంగ వైభవంగా జరగనుంది.
సంప్రదాయబద్దంగా పాలధార, తెల్ల ఏనుగు, అంజలి రథం, బెస్తవారివల ముందు నడవగా, అశేష భక్తుల జయజయద్వానాల మధ్య పైడితల్లి అమ్మవారు ఉత్సవ వీధుల్లో సిరిమాను రధం తిరగనుంది. కాగా పూజారి బంటుపల్లి వెంకటరావు తొమ్మిదోసారి సిరిమాపై భక్తులను ఆశీర్వదించడం విశేషం.
Similar News
News March 29, 2026
కడప : కళ్యాణానికి గట్టి బందోబస్తు SP

ఏప్రిల్ 1వ తేదీన జరిగే ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణానికి గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ నచికేత్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన కళ్యాణం రోజు చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక, ముఖ్యమంత్రితో పాటు పలువురు వీఐపీలు వస్తారన్నారు.
News March 29, 2026
అల్లూరి జిల్లాలో బెట్టింగ్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి బెట్టింగ్ కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ అమిత్ బర్దార్ ఆదివారం తెలిపారు. బెట్టింగ్‌లతో సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో భవిష్యత్తును ప్రమాదంలో పెట్టొద్దని హితవు పలికారు. ముఖ్యంగా యువత ప్రవర్తనపై కన్నేసి ఉంచాలని తల్లిదండ్రులనున సూచించారు. జిల్లాలో బెట్టింగ్ నియంత్రణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
News March 29, 2026
HYD: రాత్రి వర్షం కురిసే ఛాన్స్..!

హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో నేడు సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షం కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ తెలిపింది. మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని, ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉందని, గొడుగులు లేదా రెయిన్ కోట్లు ఉంచుకోవాలని హెచ్చరించింది.


