News November 19, 2025
నేడే PM కిసాన్ 21వ విడత డబ్బుల జమ

PM కిసాన్ 21వ విడత నిధులు ఇవాళ విడుదల కానున్నాయి. రబీ పంట పెట్టుబడి సాయం కింద దేశ వ్యాప్తంగా 11 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేలు చొప్పున ప్రధాని మోదీ జమ చేయనున్నారు. 2019 FEB-24న PM కిసాన్ ప్రారంభించగా ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అన్నదాతల అకౌంట్లలో జమ చేశారు. పీఎం కిసాన్ పోర్టల్‌లో నమోదై, బ్యాంకు ఖాతా ఆధార్‌తో లింక్ అయిన రైతులకే ఈ పథకం ప్రయోజనం అందనుంది.
Similar News
News November 23, 2025
రేషన్ కార్డులు ఉన్న వారికి ఫ్రీగా క్లాత్ బ్యాగులు?

TG: వచ్చే నెల నుంచి రేషన్ కార్డులు ఉన్న వారికి సన్నబియ్యంతో పాటు మల్టీ పర్పస్ క్లాత్ బ్యాగులను ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ప్లాస్టిక్ వినియోగం తగ్గించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ బ్యాగులపై ప్రభుత్వ 6 గ్యారంటీల లోగోలు ఉంటాయని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా OCTలోనే ఈ బ్యాగులను పంపిణీ చేయాల్సి ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది.
News November 23, 2025
నాకు పేరు పెట్టింది ఆయనే: సాయిపల్లవి

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శత జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హీరోయిన్ సాయిపల్లవి గతంలో చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. తన అమ్మ, తాతయ్య సాయిబాబాకు భక్తులని తెలిపారు. పుట్టపర్తి సాయి తనను దీవించి పేరు పెట్టినట్లు వెల్లడించారు. తాను కూడా సాయిబాబా భక్తురాలినేనని, ఆయన బోధనలు తనలో ధైర్యం నింపాయని చెప్పారు. ప్రశాంతత, క్రమశిక్షణ, ధ్యానం వంటివి ఆయన నుంచి నేర్చుకున్నట్లు పేర్కొన్నారు.
News November 23, 2025
APPLY NOW: జిప్‌మర్‌లో ఉద్యోగాలు

జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) 9 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DM, MS, DNB, M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://jipmer.edu.in/


