News April 6, 2024
నేతన్న కుటుంబానికి రూ.50,000 ఆర్థికసాయం చేసిన కేటీఆర్
సిరిసిల్లలో ఉరేసుకుని<<13002333>> లక్ష్మీనారాయణ<<>> అనే నేత కార్మికుడు మృతి చెందాడు. ఆయన పార్థివదేహానికి ఎమ్మెల్యే కేటీఆర్ నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు తక్షణ సహాయం కింద రూ. 50,000 ఆర్థికసాయం చేశారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థికసాయమందించాలని కలెక్టర్ను కోరారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Similar News
News December 24, 2024
కరీంనగర్: దివ్యాంగులకు జాబ్ మేళా
కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో గ్రాస్ రూట్ అకాడమీ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో 27 డిసెంబర్ 2024న దివ్యాంగుల కోసం ఉద్యోగమేళాను నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమ అధికారి కె సబితా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా నిర్వహిస్తామని, 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు అర్హులని తెలిపారు.
News December 24, 2024
వరిధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ వ్యాఖ్యలు
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లపై సిరిసిల్ల ఎమ్మెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది 46 లక్షల మెట్రిక్ టన్నులేనని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి, దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టారని రాసుకొచ్చారు.
News December 24, 2024
BREAKING.. వీణవంకలో దారుణం.. వ్యక్తిపై గొడ్డిలితో దాడి
కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. వీణవంక మండలం హిమ్మత్నగర్లో వెంకటరాజురెడ్డి అనే వ్యక్తిపై ముగ్గురు దుండగులు గొడ్డలితో దాడి చేసి చేతి వేళ్లు నరికేశారు. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం హనుమకొండకు తరలించారు. కాగా, బాధితుడు సీడ్ వ్యాపారిగా తెలుస్తోంది. చేతి నాలుగు వేళ్లు కట్ అవగా.. బొటన వేలు ఒక్కటే ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.