News March 26, 2025

నేత్రపర్వంగా భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి నిత్యకళ్యాణ వేడుక బుధవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితరపూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మ వారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకళ్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

Similar News

News December 28, 2025

శబరిమల ఆలయం మూసివేత.. రీఓపెన్ ఎప్పుడంటే?

image

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో పవిత్ర మండల పూజ పూర్తయింది. శనివారం రాత్రి 10 గంటలకు హరివరాసనం పాడిన తర్వాత మండల పూజా కాలం ముగింపును సూచిస్తూ గుడిని మూసివేసినట్లు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు(TDB) తెలిపింది. మకరవిళక్కు పండుగ కోసం ఈ నెల 30న 5PMకు ఆలయం తెరుస్తామని చెప్పింది. మరోవైపు ఇప్పటిదాకా 30 లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నారు. ₹333 కోట్ల ఆదాయం టెంపుల్‌కు వచ్చింది.

News December 28, 2025

RMPT: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు శనివారం కన్నుమూశాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. RMPT మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం తేజ గౌడ్ మూడు నెలల క్రితం కర్నాల్‌పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తలకి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా శనివారం పరిస్థితి విషమించి మృతి చెందాడు.

News December 28, 2025

ఉక్రెయిన్ ఒప్పుకోకున్నా మా ‘లక్ష్యం’ సాధిస్తాం: పుతిన్

image

రెండు దేశాల మధ్య వివాదాన్ని శాంతియుత మార్గాల్లో పరిష్కరించుకునేందుకు ఉక్రెయిన్ త్వరపడటం లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఒకవేళ ఆ దేశం ఇందుకు సిద్ధంగా లేకపోతే ప్రత్యేక సైనిక చర్య ద్వారా బలవంతంగానైనా అన్ని లక్ష్యాలను సాధిస్తామని హెచ్చరించారు. 500 డ్రోన్లు, 40 మిసైళ్లతో దాడి చేసిన నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం. కమాండ్ పోస్టులను పరిశీలించిన సందర్భంగా సైనిక దుస్తుల్లో పుతిన్ కనిపించారు.