News January 31, 2026
నేను విన్నర్.. కింగ్ మేకర్‌ను కాదు: విజయ్

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే తప్పకుండా గెలుస్తుందని ఆ పార్టీ చీఫ్ విజయ్ అన్నారు. ‘నన్ను కింగ్ మేకర్ అనడం నాకు ఇష్టముండదు. కింగ్ మేకర్ అంటే మెయిన్ డ్రైవర్ కాదు.. సపోర్టర్. నేను గెలుస్తా. అలాంటప్పుడు కింగ్ మేకర్ ఎందుకవుతా? మా సభలకు వస్తున్న క్రౌడ్‌ను చూడట్లేదా’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కరూర్ తొక్కిసలాట తనను ఇప్పటికీ వెంటాడుతోందని చెప్పారు. తన సినిమాలకు అడ్డంకులు వస్తాయని ముందే ఊహించానన్నారు.
Similar News
News February 14, 2026
శివరాత్రి: రేపు ఉపవాసం ఎవరు ఉండాలి?

మనస్సును అదుపులో ఉంచుకుని ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే ఆరోగ్యవంతులైన భక్తులందరూ శివరాత్రి నాడు ఉపవాసం ఉండవచ్చు. మోక్షం కోరేవారు, పాప ప్రక్షాళన కావాలనుకునేవారు, శివకృపకై పరితపించేవారు రేపు ఉపవాసం ఉండాలని పండితుల సూచన. ‘రోజంతా ఉపవాసం ఉండి, రాత్రంతా జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేస్తే ఆత్మశుద్ధి జరుగుతుంది. మనోబలం పెరిగి ఈశ్వరుని అనుగ్రహంతో తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి’ అంటున్నారు.
News February 14, 2026
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఫలితాలు

TG: మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీల్లో 66 చోట్ల స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది. BRS 13 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. బీజేపీ ఏ ఒక్క మున్సిపాలిటీలోనూ సగానికంటే ఎక్కువ వార్డులు గెలుచుకోలేకపోయింది. వార్డుల పరంగా చూస్తే మొత్తం 2,581 వార్డుల్లో కాంగ్రెస్ 1,347, BRS 716, బీజేపీ 261, MIM, లెఫ్ట్ పార్టీలు, ఇతరులు 257 చోట్ల విజయం సాధించారు.
News February 14, 2026
70 స్థానాల్లో ఎంఐఎం విజయం.. భైంసా దక్కేనా!

TG: అసదుద్దీన్ ఒవైసీ పార్టీ MIM రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 70 వార్డు/డివిజన్ స్థానాల్లో విజయం సాధించింది. నిజామాబాద్ కార్పొరేషన్(60)లో కింగ్ మేకర్‌గా నిలిచిన ఈ పార్టీ(14 సీట్లు), భైంసా మున్సిపాలిటీలో మెజార్టీకి 2 సీట్ల దూరంలో ఉంది. రెబల్స్, కాంగ్రెస్ మద్దతుతో పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీ చీఫ్ అసదుద్దీన్ మంతనాలు చేస్తున్నారు. బోధన్‌లోనూ MIM 12 వార్డులు గెలుచుకుంది.


