News March 26, 2025
నేను BRSలోనే ఉన్నా: గద్వాల MLA

తాను BRS MLAగానే ఉన్నానని గద్వాల MLA బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకటించారు. కొంత మంది కావాలని తాను కాంగ్రెస్‌లో చేరినట్లు ప్రచారం చేశారని పేర్కొన్నారు. పార్టీ మార్పుపై సుప్రీంకోర్టు నోటీసులను అనుసరించి ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు. మీడియాలో వచ్చిన కథనాలపై FEB 11న PSలో ఫిర్యాదు చేశానని చెప్పారు. తాను BRS సభ్యత్వాన్ని వదులుకోలేదని, పిటిషన్ కొట్టివేయాలని కోరారు. BRSలోనే ఉన్నానని KTRకు చెప్పానన్నారు.
Similar News
News September 19, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.
News September 19, 2025
సీసీ కుంట: కురుమూర్తి స్వామికి రూ.2,02,75,000 ఆదాయం

చిన్నచింతకుంట మండలం అమ్మాపురంలోని కురుమూర్తి స్వామి జాతర బ్రహ్మోత్సవాలు దీపావళి అమావాస్యకు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా వివిధ వ్యాపారాల నిర్వహణకు నిర్వహించిన వేలంలో ఆలయానికి రూ.2,02,75,000 ఆదాయం వచ్చింది. కొబ్బరికాయల విక్రయానికి రూ.56.25 లక్షలు, పూజా సామగ్రికి రూ.16.50 లక్షలు, పులిహోర ప్రసాదం విక్రయానికి రూ.46 లక్షలు, తలనీలాల సేకరణకు రూ.32 లక్షలు పలికాయి.
News September 19, 2025
పోలీస్ శాఖలో 12,542 ఖాళీలు!

TG: పోలీస్ శాఖలో వివిధ కేటగిరీల్లో 12,542 ఖాళీ పోస్టులున్నాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తాజాగా ఆర్థికశాఖకు వివరాలు సమర్పించింది. అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో 8,442, ఏఆర్ కానిస్టేబుల్ 3,271, SI సివిల్ కేటగిరీలో 677, ఏఆర్‌లో 40, టీజీఎస్పీ కేటగిరీలో 22 పోస్టులున్నట్లు పేర్కొంది. వీటిని జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.