News September 10, 2025
నేపాల్‌లో చిక్కుకున్న విశాఖ వాసులు

విశాఖ నుంచి విహారయాత్రకు వెళ్లిన 11 మంది నేపాల్‌లో చిక్కుకుపోయారు. అక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో తిరిగి వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సహాయం కోసం వారి కుటుంబీకులకు సమాచారం అందించారు. ఎంపీ భరత్, మంత్రి లోకేశ్ దృష్టికి కుటుంబ సభ్యులు తీసుకువెళ్లారు. వీరందరూ ఎల్ఐసీలో ఉద్యోగాలు చేస్తున్నారని, తిరిగి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లూ చేస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారన్నారు.
Similar News
News September 10, 2025
గుంటూరు సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బాధ్యతలు

గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన గుంటూరుకు వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మీని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహూకరించారు. జిల్లా రెవెన్యూ అధికారి ఖాజావలి, డివిజనల్ అధికారి శ్రీనివాసరావు, ఏవో పూర్ణచంద్రరావు తదితరులు సంయుక్త కలెక్టర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
News September 10, 2025
ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధిగ్రస్థుడి లివర్ ఇలా మారుతుంది!

ఎక్కువ మోతాదులో, దీర్ఘకాలం పాటు మద్యం సేవించడం వల్ల ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సేవించిన ఆల్కహాల్ దాదాపు కాలేయం ద్వారానే జీర్ణమవుతుందని, ఈ ప్రక్రియలో ఇది అనేక రసాయనాలను విడగొడుతుందని చెబుతున్నారు. ఈక్రమంలో మద్యం తాగే వారిని హెచ్చరించేందుకు ప్రముఖ లివర్ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధిగ్రస్థుడి లివర్ ఫొటోను షేర్ చేశారు.
News September 10, 2025
తిరుపతి: టీటీడీ ఛైర్మన్‌ను కలిసిన పూర్వపు ఈవో

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్ నాయుడును బదిలీపై వెళ్తున్న పూర్వపు ఈవో శ్యామలరావు బుధవారం ఛైర్మన్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈవోగా పదవీకాలంలో తనకు అన్ని విధాల సహకరించిన బిఆర్ నాయుడుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ శ్యామల రావును శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రతిమను జ్ఞాపికగా అందజేశారు. తర్వాత కాసేపు ముచ్చటించారు.