News April 12, 2025

నేరడిగొండలో 52 మందికి TB పాజిటివ్

image

నేరడిగొండ మండలంలో నెల క్రితం పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. వారిలో మొత్తం 52 మందికి టీబీ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శుక్రవారం హెచ్ఈఓ పవార్ రవీందర్ వెల్లడించారు. శుక్రవారం 25 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. టీబీ బాధితులకు 6 నెలల వైద్యంతో పాటు నెలకు రూ.1000, పోషణ న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నామన్నారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్, సంతోష్, తదితరులున్నారు.

Similar News

News April 13, 2025

MNCL: పసి పాప ప్రాణం తీసిన పాము

image

లక్షెట్టిపేట మండలం వెంకట్రావ్ పేట‌లో విషాదం చోటు చేసుకుంది. పాముకాటుతో ముక్కుపచ్చలారని చిన్నారి కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జాడి సుధాకర్ నాలుగేళ్ల కుమార్తె ఉదయశ్రీ శనివారం సాయంత్రం పాముకాటుతో మృతి చెందింది. ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా పాము కాటు వేయడంతో వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా మృతి చెందింది.

News April 13, 2025

ADB : BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

image

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటుచేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ శ్రేణులకు ఇప్పటికే మాజీ మంత్రి జోగు రామన్న, MLA అనిల్ జాదవ్, ఖానాపూర్ ఇన్‌ఛార్జ్ జాన్సన్‌నాయక్ దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

News April 13, 2025

ఆదిలాబాద్‌: రేపు ITI కళాశాలలో అప్రెంటిషిప్ మేళా

image

ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈనెల 14న జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైనా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు అప్రెంటిషిప్ యాక్ట్ ప్రకారంగా స్టైపెండ్‌ను శిక్షణ కాలంలో నేరుగా అభ్యర్థుల ఖాతాలకు జమ చేస్తాయన్నారు.

error: Content is protected !!