News March 30, 2024
నేరడిగొండ: కొడుకు వేధింపులు.. తండ్రి సూసైడ్

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కొడుకు వేధింపులు తాళలేక తండ్రి ఆత్మహత్యే చేసుకున్నాడు. నేరడిగొండ మండలం రాజుల తండాకు చెందిన నూరిసింగ్ (60)కు ఇద్దరు భార్యలు. రెండో భార్య కుమారుడు అంకుశ్ పెళ్లి చేసుకొని విడిగా ఉంటున్నాడు. ఆస్తిలో వాటా ఇవ్వాలంటూ తండ్రిని నిత్యం వేధించేవాడు. దీంతో నూరిసింగ్ పొలం వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై వెల్లడించారు.
Similar News
News October 26, 2025
ADB: కాంగ్రెస్లో కొత్త ట్రెండ్

కాంగ్రెస్ 42% బీసీ రిజర్వేషన్ ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుల(డీసీసీ) పదవుల్లో సైతం బడుగులకు ప్రాధాన్యతనివ్వనుంది. నిన్న ఢిల్లీలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50% అధ్యక్ష పదవులు ఇవ్వాలని, గతంలో ఎలాంటి పదవులు చేపట్టని వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించడంతో జిల్లాలో డీసీసీ పదవి కోసం ఆశిస్తున్న వారిలో ఉత్కంఠ నెలకొంది.
News October 26, 2025
ఆదిలాబాద్: ‘31లోగా బోర్డుకు ఫీజు చెల్లించాలి’

ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల నుంచి గుర్తింపు ఫీజు (రూ. 220), గ్రీన్ ఫండ్ ఫీజు (రూ.15) కలిపి మొత్తం రూ.235ను ఈనెల 31 లోగా చెల్లించాలని డీఐఈవో జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ప్రిన్సిపల్లు tgbie.cgg.gov.in పోర్టల్ ద్వారా చెల్లింపులు చేయాలని ఆయన ఆదేశించారు. సకాలంలో ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 26, 2025
NPA, స్త్రీ నిధిపై ADB కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

ఆదిలాబాద్ కలెక్టరేట్లో APM, DPMలతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్యాంకు లింకేజి, NPAల తగ్గింపు, ఇందిరమ్మ లబ్ధిదారులకు ఆర్థిక సహాయం, స్త్రీ నిధి పురోగతిపై ప్రధానంగా చర్చించారు. కౌమార సభ్యుల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, డీఆర్డీఓ రవీందర్ రాథోడ్, ఎల్డీఎం ఉత్పల్ కుమార్ పాల్గొన్నారు.


