News March 3, 2025

నేరడిగొండ: WOW.. ఇక్కడి ఆడపడుచులు GREAT

image

నేరడిగొండ మండలం మంగల్ మోట (తర్నం) గ్రామానికి చెందిన ఆడపడుచులు పేదింటి యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఆదివాసీ గ్రామాల్లో కట్న కానుకలను నిషేధిస్తూ ఆదివాసీలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి కట్న కానుకలు లేకపోవటంతో గ్రామంలో 60 కుటుంబాల ఆడపడుచులు కలిసి వారికి తోచినంత పొదుపు చేసుకొని రూ.12,342 ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Similar News

News November 6, 2025

జాతీయ స్థాయి గిరిజన భాషా సదస్సుకు ADB వాసి

image

మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి గిరిజన భాషా సదస్సుకు ఆదిలాబాద్ జిల్లా వాసికి ఆహ్వానం అందింది. ఈ నెల 11, 12 తేదీల్లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి గిరిజన భాషా పరిరక్షకులు, మేధావులు, రచయితల సదస్సులో పాల్గొనాలని ప్రభుత్వ ఉపాధ్యాయుడు తొడసం కైలాస్‌కు ఆహ్వానం లభించింది. జాతీయ స్థాయి సదస్సుకు ఆహ్వానించడం ఎంతో గర్వకారణం అని కైలాస్ అన్నారు.

News November 6, 2025

ప్రతి గర్భిణీ, బాలింతలకు పరీక్షలు చేయాలి: ADB కలెక్టర్

image

ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సమయానికి చికిత్స అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందని కలెక్టర్ రాజర్షి షా ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణీ, బాలింతలను గుర్తించి సమయానికి వైద్యపరీక్షలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. సరైన పోషకాహారం అందించడంలో సిబ్బంది చురుకుగా వ్యవహరించాలన్నారు.

News November 6, 2025

నేటి బంద్ వాయిదా: ADB కలెక్టర్

image

రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి పంట కొనుగోళ్ల నిరవదిక బంద్‌ను వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఏపీసీ, సెక్రటరీ, సీసీఐ సీఎండీ, జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మధ్య జరిగిన చర్చలు సఫలం అయ్యాయన్నారు. దీంతో ఈ నెల 6 నుంచి చేపట్టే కొనుగోళ్ల నిరవధిక సమ్మెను వాయిదా వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.