News March 3, 2025
నేరడిగొండ: WOW.. ఇక్కడి ఆడపడుచులు GREAT

ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం మంగల్ మోట (తర్నం) గ్రామానికి చెందిన ఆడపడుచులు పేదింటి యువతి పెళ్లికి ఆర్థిక సాయం చేసి అండగా నిలిచారు. ఆదివాసీ గ్రామాల్లో కట్న కానుకలను నిషేధిస్తూ ఆదివాసీలు తీర్మానం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఎలాంటి కట్న కానుకలు లేకపోవటంతో గ్రామంలో 60 కుటుంబాల ఆడపడుచులు కలిసి వారికి తోచినంత పొదుపు చేసుకొని రూ.12,342 ఆర్థిక సాయాన్ని అందజేశారు.
Similar News
News November 4, 2025
చిత్తూరు: ఇంజినీరింగ్ విద్యార్థి సూసైడ్

చిత్తూరులోని ఓ కాలేజీలో బీటెక్ సెకండియర్ విద్యార్థి మూడో అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కాలేజీలో వారంలోపే రెండో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
News November 4, 2025
తెల్లారకముందే జూబ్లీలో పార్టీల కూత

సూర్యుడు ఇంకా ఉదయించక ముందే.. మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జూబ్లీ వీధుల్లో వాలిపోతున్నారు. ఉపఎన్నిక సందర్భంగా ఓటర్లను కలుస్తూ నచ్చిన హామీలిస్తున్నారు. ప్రచారానికి వెళ్లడం ఆలస్యమైతే ఓటర్లు పనులకు వెళ్లిపోతారని కాబోలు. ఇక్కడ ఎక్కువ శాతం బస్తీలు ఉండటంతో ప్రజలు ఉపాధి కోసం పనులకు వెళ్తారు. అందుకే నాయకులు ఉదయాన్నే ప్రచారానికి వెళుతున్నారు.
News November 4, 2025
6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దు: అ.కలెక్టర్

ఈనెల 6న పత్తి కొనుగోలు స్లాట్ బుకింగ్ చేసుకోవద్దని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో మంగళవారం పత్తి కొనుగోలు పై మార్కెట్ కమిటీ ఛైర్మన్లు, జిన్నింగ్ మిల్ యాజమాన్యం, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ బంద్ పిలుపుమేరకు సీసీ కొనుగోలు కేంద్రాలకు ఆ రోజు పత్తి తీసుకురావద్దని సూచించారు.


