News February 24, 2026

నేరాలకు దూరంగా ఉంటేనే ఉజ్వల భవిష్యత్తు: ఎస్పీ

image

విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. మంగళవారం కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువత చెడు మార్గంలో వెళ్లి క్రిమినల్ కేసుల్లో చిక్కుకుంటే ఉద్యోగాలు, వీసాలు రాక భవిష్యత్తు దెబ్బతింటుందని హెచ్చరించారు. సైబర్ నేరాలకు గురైతే వెంటనే ‘1930’ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 25, 2026

‘న్యాయవ్యవస్థలో అవినీతి’ పాఠ్యాంశంపై CJI అభ్యంతరం

image

NCERT 8వ తరగతి సోషల్ సైన్స్ పుస్తకంలో <<19224324>>‘న్యాయవ్యవస్థలో అవినీతి’<<>> పాఠ్యాంశంపై CJI జస్టిస్ సూర్యకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై సుమోటోగా విచారణ చేపడతామన్నారు. ‘ఇది జుడీషియరీపై ఒక ప్రణాళికబద్ధమైన దాడిగా కనిపిస్తోంది. న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసేందుకు అనుమతించబోం. ఆ కంటెంట్‌పై న్యాయమూర్తులు కలవరపడుతున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.

News February 25, 2026

మనీ ప్లానింగ్ లేకపోతే ఇబ్బందులు తప్పవు: తమన్నా

image

కెరీర్ ఆరంభంలో తన ఆర్థిక వ్యవహారాలను తండ్రే చూసుకునేవారని హీరోయిన్ తమన్నా వెల్లడించారు. ఆయన నుంచే ఆర్థిక ప్రణాళికలు నేర్చుకొని రియల్ ఎస్టేట్, ఆభరణాలు, ఇతర మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు తెలిపారు. ‘ఇండస్ట్రీలో ఆదాయం ఎప్పుడూ ఒకేలా ఉండదు. యాక్టర్లు చాలా డబ్బు సంపాదిస్తారు. అంతే త్వరగా కోల్పోతారు. అందుకే సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

News February 25, 2026

HYD: 21 మంది ప్రభుత్వ వైద్యుల తొలగింపు

image

విధులకు హాజరుకాక, దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ DME నరేంద్రకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో నగరంలోని గాంధీ, పేట్లబుర్జూ, కోఠి ప్రసూతి ఆస్పత్రి వైద్యులతో సహా 21 మంది ఉన్నారు. ప్రభుత్వ దవాఖానాలకు ఎంపికైనా జాయిన్ అవ్వని, లాంగ్ లీవ్‌లో ఉన్న వారిని రాష్ట్ర వ్యాప్తంగా 94 మందిని తొలగించారు. వీరంతా అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి ఉద్యోగులే కావడం గమనార్హం.