News March 3, 2025
నేరాలపై సైబరాబాద్ పోలీసులు ఫోకస్

CYB కమిషనరేట్ పరిధి 510 ప్రాంతాల్లో శనివారం DCPల ఆధ్వర్యంలో రైడ్స్ చేశారు. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్న 380 మందిని అదుపులోకి తీసుకోగా.. గంజాయి తాగుతున్న14 మందిని పట్టుకున్నారు. మానవ అక్రమ రవాణా కేసులు 1, వ్యభిచారం 26, నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులపై2, బహిరంగ ప్రదేశాల్లో మందు తాగిన ఘటనలో 15 కేసులు, న్యూసెన్స్ 57, నంబర్ ప్లేట్ లేని 18 వాహనాలపై కేసులు నమోదు కాగా 4 వెహికల్స్ స్వాధీనం చేసుకున్నారు.
Similar News
News November 3, 2025
పిల్లలను అనాథలుగా మార్చిన మీర్జాగూడ ప్రమాదం

మీర్జాగూడ ప్రమాదం ఆ పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చింది. యాలాల మండలం హాజీపూర్‌కు చెందిన బందప్ప-లక్ష్మి దంపతులు. వీరికి భవానీ, శివాలీ(ఆడబిడ్డలు) సంతానం. సోమవారం ఉదయం జరిగిన ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. అమ్మ-నాన్నను కోల్పోయిన పిల్లలు అనాథలుగా మిగిలారు. ఇప్పటికే పేదరికంలో ఉన్న ఆ ఫ్యామిలీ పెద్ద దిక్కును కోల్పోయింది. చేవెళ్ల ఆస్పత్రి ఆవరణలో పిల్లల కన్నీరు అందరినీ కలచివేసింది.
News November 3, 2025
HYD: కాంగ్రెస్ అభివృద్ధికి, BRS అవినీతికి మధ్య పోరాటం: కాంగ్రెస్ నేత

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అనేది కాంగ్రెస్ చేస్తున్న అభివృద్ధికి, BRS చేసిన అవినీతికి మధ్య జరుగుతున్న పోరాటమని TPCC ఉపాధ్యక్షుడు, కాంగ్రెస్ కూకట్పల్లి ఇన్ఛార్జ్ బండి రమేశ్ తెలిపారు. మధురానగర్‌లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తోందని, దానిని మరింత ముందుకు తీసుకెళ్లాలంటే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు.
News November 3, 2025
HYD: బస్సు ప్రమాదంపై KCR, KTR దిగ్భ్రాంతి

మీర్జాగూడ ప్రమాద ఘటనపై మాజీ CM KCR, మాజీ మంత్రి KTR తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు చనిపోవడం అత్యంత బాధకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి సూచించారు.


