News March 29, 2025
నేరాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపాలి: ఎస్పీ

గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో మార్చి-2025 నెల నేర సమీక్ష సమావేశంలో నిర్వహించారు. సమావేశంలో జిల్లా నేర సమీక్ష నిర్వహణ ప్రత్యేక అధికారి IG హరికృష్ణ పాల్గొని పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. నేరాల పరిశోధన, నియంత్రణ కొరకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశా నిర్దేశం చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సతీశ్ కుమార్ అధికారులను ఆదేశించారు.
Similar News
News March 31, 2025
గుంటూరు నగరంలో ఎస్పీ ఆకస్మిక తనిఖీ

గుంటూరు నగరంలో సోమవారం ఎస్పీ సతీశ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ట్రాఫిక్ నియంత్రణ, బందోబస్తు నిర్వహిస్తున్న తీరును తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బందిలో వివిధ నిర్వాహణలో జవాబు దారీతనాన్ని పెంపొందించడానికి ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.
News March 31, 2025
ఫిరంగిపురం: పిల్లలకు నరకం చూపించిన సవతి తల్లి

ఫిరంగిపురంలో పిల్లల్ని సవతి తల్లి లక్ష్మి కొట్టి చంపిన ఘటన తెలిసిందే. కాగా కొన్ని నెలల క్రితం ఆమె ఓ పాపకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి కార్తీక్, ఆకాశ్‌లను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈనెల 29న ఆమె ఆకాశ్‌ను వేడి పెనంపై కూర్చోబెట్టింది. కార్తీక్‌ను తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సమాచారం అందుకున్న మేనత్త వారిద్దరినీ తీసుకెళ్లింది. అప్పటికే కార్తీక్ చనిపోయాడు.
News March 31, 2025
గుంటూరు: నేడు PGRS కార్యక్రమం రద్దు

రంజాన్ పర్వదిన సందర్భంగా నేడు PGRS కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ సతీశ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. జిల్లా పోలీస్ కార్యాలయంలో అర్జీలు ఇవ్వదలచుకున్న ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.