News December 29, 2024
నేరాలు పెరిగాయి: NLG ఎస్పీ
నల్గొండ జిల్లాలో గడిచిన ఏడాది నేరాలు పెరగ్గా, రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పారు. మహిళలపైన లైంగిక దాడులు, హత్యలు ఎక్కువగానే జరిగాయన్నారు. దోపిడీలు, దొంగతనాలు కూడా గతేడాదితో పోల్చితే పెరిగాయని తెలిపారు. 2024లో జిల్లాలో 33 హత్యలు, 100 లైంగిక దాడులు, 657 చీటింగ్ కేసులు నమోదయ్యాయి. నల్గొండను నేర రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Similar News
News January 1, 2025
నేటి నుంచి యాదగిరిగుట్టలో ప్రత్యేక దర్శనాలు
యాదగిరిగుట్ట క్షేత్రానికి వచ్చే దివ్యాంగులు, వృద్ధులు, చంటిపిల్లల తల్లులకు నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తున్నట్లు ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి 11.30, సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య దివ్యాంగులు, చంటిపిల్లలు, వృద్ధులకు ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తామన్నారు.
News January 1, 2025
NLG: న్యూ ఇయర్ వేడుకలకు పిలిచి గొంతు కోసి హత్య
కొత్త సంవత్సరం పూట సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. చివ్వెంల మండలం లక్ష్మీతండాలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. తండాకు చెందిన ధరావత్ శేషు(39)ను న్యూ ఇయర్ వేడుకలకు పిలిచి ప్రత్యర్థులు గొంతు కోసి హత్య చేశారు. కాగా భూ తగాదాలే హత్యకు కారణంగా తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 1, 2025
మిర్యాలగూడ: లెక్కల టీచర్‌గా కలెక్టర్
పదవ తరగతిలో ఉత్తమ ఫలితాల సాధనకు విద్యార్థినులు కష్టపడి చదవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినీలతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యా సామర్ధ్యాలను పరిశీలించారు. 10వ తరగతి గణితంపై ముఖ్యంగా సంభావ్యతపై విద్యార్థినులను ప్రశ్న, జవాబులు అడగడమే కాకుండా, బోర్డుపై లెక్కలను వేసి సమాధానాలు రాబట్టారు.