News October 9, 2025
నేరాల కట్టడికి పటిష్టమైన చర్యలు చేపట్టాలి: ఎస్పీ

నేరాలు జరగకుండా పటిష్టమైన గస్తీ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసులకు సూచించారు. గురువారం ఆయన మావల పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి, సిబ్బంది విధులను, ఫిర్యాదుదారుల పట్ల వ్యవహరిస్తున్న తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ కర్ర స్వామి సహా ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News October 9, 2025
ADB: తొలి విడత ఎన్నికలు జరిగే ZPTC/ MPTC స్థానాలు

ADB: తొలుత మొదటి దశలో ఆదిలాబాద్ జిల్లాలో ఎంపీటీసీ 80 , జెడ్పీటీసీ 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికలు జరిగే ZPTC/ MPTC స్థానాలు.. బజార్హత్నూర్ (08) , భీంపూర్ (07), బోథ్ (10), ఇచ్చోడ (13), గుడిహత్నూర్ (09), నేరడిగొండ (08), సిరికొండ (05), సోనాల (05),
తలమడుగు (10), తాంసి (05) ఉన్నాయి.
News October 9, 2025
రేపు ఆదిలాబాద్‌లో మెగా జాబ్ మేళా

ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ఈనెల 10న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ అతిక్ బేగం పేర్కొన్నారు. సాఫ్ట్ వేర్ రంగంలో IT, DPO పోస్టు కొరకు ఈ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 75%మార్కులతో ఇంటర్ పూర్తిచేసుకున్న వారు అర్హులని పేర్కొన్నారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు తమ సర్టిఫికెట్ లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.
SHARE IT.
News October 9, 2025
ADB: లోకల్ వార్.. బరిలోకి కామ్రేడ్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. ఈసారి కామ్రేడ్లు సైతం బరిలో నిలవనున్నారు. 6 జడ్పీటీసీ స్థానాలు, 9 ఎంపీటీసీ స్థానాల్లో సీపీఐ అభ్యర్థులు పొటీ చేసేందుకు నిర్వహించారు. బోథ్, రూరల్, తాంసి, నార్నూర్, భీంపూర్, మావల, భోరజ్ ZPTC, బోథ్-1, బోథ్-2, అందూర్, బండల్ నాగపూర్, కప్పర్ల, తాంసి, భీంపూర్ వడుర్, భోరజ్, పెండల్వాడ, బాలాపూర్ MPTC స్థానాల్లో బరిలోకి దిగనున్నారు.