News August 29, 2025

నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి: ఎస్పీ కిరణ్ ఖరే

image

నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. మహిళల భద్రత, నేరాలు, రాత్రి పహారా బలోపితంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న నేరాలపై సమగ్ర సమీక్ష చేపట్టారు. ప్రజల విశ్వాసం పొందే విధంగా ప్రతి పోలీస్ అధికారి క్రమశిక్షణతో విధులు నిర్వహించాలన్నారు.

Similar News

News August 29, 2025

సిద్దిపేట: ‘ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించండి’

image

స్థానిక ఎన్నికలు సజావుగా సాగేలా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కలెక్టర్ కె. హైమావతి కోరారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హల్‌లో జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 508 గ్రామ పంచాయతీల్లో 4508 పోలింగు స్టేషన్లలో 1 జూలై 2025 వరకు 6,55,958 ఓటర్లు ఉన్నారన్నారు. ఈ 508 గ్రామ పంచాయతీలలో ఓటర్ లిస్టు విడుదల చేస్తామని చెప్పారు.

News August 29, 2025

వరంగల్: తహశీల్దార్‌పై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు

image

ఖిలావరంగల్ తహశీల్దార్ బండి నాగేశ్వర్ రావుపై ఏసీబీ ఆదాయానికి మించిన కేసు నమోదు చేసింది. హనుమకొండ, ఖమ్మంలో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు రూ.1.15 కోట్ల ఇల్లు, రూ.1.43 కోట్ల 17.10 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.24 లక్షల బంగారు ఆభరణాలు, రూ.లక్ష విలువైన వెండి, రూ.35 లక్షల 2 ఫోర్ వీలర్స్, రూ.3 లక్షల విలువైన రిస్ట్ వాచెస్ సహా మొత్తం రూ.5 కోట్లకు పైగానే ఆస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.

News August 29, 2025

350 కేజీల గంజాయి స్వాధీనం: అదనపు ఎస్పీ ధీరజ్

image

జి.మాడుగుల మండలం అనర్భ గ్రామంలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. జిల్లా అదనపు ఎస్పీ ధీరజ్ తెలిపిన వివరాల ప్రకారం.. వాహన తనిఖీల్లో బొలెరో, బైక్‌పై తరలిస్తున్న 350 కేజీల గంజాయిని ఎస్సై షణ్ముఖరావు, ఆయన సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి, వాహనాలను సీజ్ చేశారు.