News February 6, 2025

నేరాల నియంత్రణకు రాత్రి వేళల్లో ముమ్మర గస్తీ: వరంగల్ సీపీ

image

నేరాలను నియంత్రణకు రాత్రి సమయాల్లో పోలీసులు ముమ్మరంగా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా అర్ధరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా పెట్రోలింగ్‌తో అనుమానిత వ్యక్తులు, వాహనాలు తనిఖీ చేయాలని సూచించారు. తద్వారా ప్రజలకు పోలీసులపై నమ్మకం, నేరస్థులకు భయం కలుగుతుందని పేర్కొన్నారు.

Similar News

News February 6, 2025

కేసముద్రం: రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలు

image

రైలు నుంచి జారి పడి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కేసముద్రం మండలం ఇంటికన్నె రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల మేరకు.. పరకాలకు చెందిన అరవింద్ అనే యువకుడు శాతవాహన ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డాడు. దీంతో అరవింద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News February 6, 2025

పరకాల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. పరకాల మండలం పైడిపల్లికి చెందిన మొగిలి(60) ఈ నెల 1న తన భార్యతో కలిసి మిర్చి తోటకు బయలుదేరాడు. మార్గమధ్యలో బయటకు వెళ్తున్న అని తిరిగి రాలేదు. మొగిలి ఆచూకీ కోసం వెతుకుతుండగా పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు. అతడి భార్య తన భర్త అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 6, 2025

వరంగల్ మార్కెట్‌లో పత్తి ధర ఎంతంటే..?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధరలు అన్నదాతలను అయోమయానికి గురి చేస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,000 పలకగా.. మంగళవారం రూ.6,960కి పడిపోయి, బుధవారం రూ.6,980కి చేరింది. అలాగే నేడు మళ్లీ రూ.6970కి తగ్గినట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.

error: Content is protected !!