News October 14, 2025

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి: ASF ఎస్పీ

image

నేరాల నియంత్రణపై దృష్టి సారించాలని ASF ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో నెలవారి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లో గ్రేవ్, నాన్ గ్రేడ్ పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకొన్నారు. పెండింగ్ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గంజాయి సాగు నిర్మూలనకు ప్రత్యేక టీమ్ ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News October 15, 2025

ఓయూ: ఎంఈ, ఎం.టెక్ పరీక్షా తేదీలు ఖరారు

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఈ, ఎం.టెక్ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అన్ని విభాగాల ఎంఈ, ఎం.టెక్ కోర్సుల రెండో సెమిస్టర్ మెయిన్, బ్యాక్‌లాగ్ పరీక్షలను ఈ నెల 23వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని సూచించారు.

News October 15, 2025

సిరిసిల్ల: జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలు

image

జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా ఈనెల 13 నుంచి 17 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సిరిసిల్లలో మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్లలోని ప్రభుత్వ కళాశాలలు, హైస్కూలలో ఈ జాతీయ సీపీఆర్ అవగాహన వారోత్సవాలను నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

News October 15, 2025

భూసేకరణ పూర్తి చేయండి: కలెక్టర్

image

కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఏలూరు పవర్ పేట గేటు వద్ద, దెందులూరు (M) సీతంపేట- శ్రీరామవరం, భీమడోలు రైల్వే గేట్, పూళ్ల, కైకరం, చేబ్రోలు, ఉంగుటూరు స్టేషన్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి, రైల్వే అండర్ బ్రిడ్జిల నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు. ఎటువంటి అభ్యంతరాలు, శాంతిభద్రతల సమస్యలు ఉండకూడదన్నారు.