News June 30, 2024

నేరుగా CM చంద్రబాబును కలిసే అవకాశం

image

రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని తెలుగు తమ్ముళ్లు నేరుగా కలుసుకునే సదవకాశాన్ని కల్పించినట్లు పామర్రు టీడీపీ కార్యాలయం తెలిపింది. ఎందుకు సీఎం చంద్రబాబును కలవాలనుకుంటున్నారో సహేతుకమైన కారణాన్ని 73062 99999 సెల్ నంబర్‌కు తెలియజేస్తే, ఎప్పుడు వచ్చి కలవాలో చెబుతామంది. కార్యకర్తలు, క్షేత్రస్థాయి నాయకులకు చేరువుగా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

Similar News

News October 6, 2024

కృష్ణా: డిగ్రీ పరీక్షల టైంటేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (డిస్టెన్స్) పరిధిలో డిగ్రీ(బీ.ఏ.) చదివే విద్యార్థులు రాయాల్సిన 1, 3వ సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 1వ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 17 నుంచి 25 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. 3వ సెమిస్టర్ పరీక్షలు 17 నుంచి 26 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.

News October 6, 2024

గన్నవరంలో బంధించి పెళ్లి చేసిన పెద్దలు

image

గన్నవరం మండలం సూరంపల్లిలో ఓ యువకుడిని గ్రామస్థులు బంధించి పెళ్లి చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సూరంపల్లికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన గుడ్డేటి ప్రసన్నతో ప్రేమాయణం నడిపారు. కులాలు వేరు వేరు కావడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో శ్రీకాంత్ గ్రామానికి రావడంతో మహిళలు బంధించి ప్రసన్నతో పెళ్లి చేశామని గ్రామస్థులు తెలిపారు.

News October 6, 2024

ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైళ్లు

image

ప్రయాణికుల రద్దీ మేరకు విజయవాడ మీదుగా న్యూ టిన్‌సుఖియా (NTSK), SMVT బెంగుళూరు(SMVB) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నవంబర్ 7 నుంచి డిసెంబర్ 26 వరకు ప్రతి గురువారం NTSK-SMVB(నం.05952), నవంబర్ 11 నుంచి డిసెంబర్ 30 వరకు ప్రతి సోమవారం SMVB-NTSK(నం.05951)మధ్య ఈ ట్రైన్లు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు విజయవాడతో పాటు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయన్నారు.