News December 27, 2025

నేర శాతం 9.65 శాతం పెరిగింది: భద్రాద్రి ఎస్పీ

image

భద్రాద్రి జిల్లా పరిధిలో పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ అసాంఘిక కార్యకలాపాలను అదుపు చేయడంలో, శాంతిభద్రతల పరిరక్షణలో ముందంజలో ఉన్నామని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వార్షిక నివేదిక-2025 వార్షిక నివేదిక బుక్ లెట్‌ను విడుదల చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఏడాదితో పోలిస్తే 9.65 శాతం నేరాల శాతం పెరిగిందని అన్నారు.

Similar News

News December 27, 2025

సిట్ విచారణకు భూమన కరుణాకర్ రెడ్డి

image

తిరుమల కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఛైర్మన్, అంతకుముందు బోర్డు సభ్యులైన భూమన కరుణాకర్ రెడ్డిని సిట్ అధికారులు శనివారం విచారించారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకు అధికారులు ప్రశ్నించారు. కల్తీ నెయ్యి కేసు ఛార్జ్ షీట్ చివరి దశకు వచ్చిన నేపథ్యంలో ఆయన విచారణ చర్చనీయాంశమైంది. త్వరలో మాజీ బోర్డు సభ్యులైన ఆనాటి మార్కెటింగ్ కమిటీ సభ్యులను విచారించే అవకాశం ఉందని సమాచారం.

News December 27, 2025

గాంధీ చిత్ర పటాలతో గ్రామ గ్రామాన నిరసన: మంత్రి దామోదర

image

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మంత్రి దామోదర రాజనరసింహ విమర్శించారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా గ్రామ గ్రామాన ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత పేదలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని కాపాడుకుంటామని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.

News December 27, 2025

పలమనేరు, పీలేరు, మదనపల్లె రెవెన్యూ డివిజన్‌లో మార్పులు!

image

జిల్లాల పునర్విభజనపై CM చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో చిత్తూరు జిల్లా పరిధిలో చేపట్టనున్న మార్పులను కొనసాగించాలని నిర్ణయించారు. పలమనేరు రెవెన్యూ డివిజన్‌లోని బంగారుపాలెంను చిత్తూరు డివిజన్‌కు, చౌడేపల్లి, పుంగనూరు మండలాలను మదనపల్లి రెవెన్యూ డివిజన్‌కు బదిలీ చేయడం, సదుం, సోమల మండలాలను మదనపల్లి జిల్లాలోని పీలేరు రెవెన్యూ డివిజన్‌లో విలీనం చేయాలని తేల్చారు. డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ జారీ కానుంది.