News September 24, 2025

నేలకొండపల్లి యాక్సిడెంట్ UPDATE

image

నేలకొండపల్లిలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో <<17808359>>ఇద్దరు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. కొరట్లగూడేనికి చెందిన మనోజ్(18), సన్నీప్రసాద్(17) బంధువులు. రాత్రి నేలకొండపల్లి నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తి లొంగిపోయినట్లు సమాచారం.

Similar News

News September 24, 2025

HYD డెవలప్‌మెంట్‌లో రేవంత్ vs KCR!

image

బతుకమ్మ కుంట చుట్టూ రాజకీయం మొదలైంది. బే‘కారు’ పాలన..‘ప్రజా’పాలనకు తేడా ఇదే అంటూ కాంగ్రెస్ నేతలు బతుకమ్మ కుంట వీడియోలు SMలో పోస్ట్ చేశారు. అయితే, KCR రంగదాముని చెరువు, మల్కంచెరువు, దుర్గం చెరువులను అభివృద్ధి చేసినా ప్రచారం చేసుకోలేదని BRS నేతల వాదన. 5 ఎకరాల కుంటను అభివృద్ధి చేసిన రేవంత్ గొప్పనా?.. ఎన్నో చెరువులను సుందరీకరించిన KCR గొప్పనా? అంటూ ప్రశ్నిస్తున్నారు. దీనిపై హైదరాబాదీ కామెంట్?

News September 24, 2025

సాహసయాత్రకు బయల్దేరిన CRPF మహిళా సిబ్బంది

image

CRPF ‘యశస్వినీ’ మహిళా బైకర్ల బృందం సాహసోపేతమైన యాత్రకు బయల్దేరింది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ నుంచి లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సో సరస్సు వరకూ సాగే బైక్‌ ర్యాలీ మంగళవారం మొదలైంది. ఎత్తైన పర్వతాలు, లోతైన లోయలు, 1,400 కిలోమీటర్ల కఠిన రహదారిపై సాగే ఈ ర్యాలీలో 32 మంది మహిళా బైకర్లు పాల్గొంటున్నారు. దేశభక్తి, జాతి సమైక్యత, మహిళా సాధికారతకు ప్రతీకగా ‘దేశ్ కే హమ్ హై రక్షక్’ నినాదంతో వారు దూసుకెళ్తున్నారు.