News August 26, 2025
నేవీలో ఉద్యోగం సాధించిన గొల్లమాడ యువకుడు

నర్సాపూర్(జి) మండలం గొల్లమాడ గ్రామానికి చెందిన వంశీ ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించాడు. గ్రామానికి చెందిన రవి- రాధ దంపతుల పెద్ద కొడుకైన వంశీ మొదటి ప్రయత్నంలోనే నేవీలో మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించాడు. తండ్రి వ్యవసాయం చేస్తూ, తల్లి బీడీలు చుట్టి బిడ్డను చదివించారు. వంశీ కష్టపడి చదివి ఉద్యోగం సాధించడంతో తల్లిదండ్రులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
Similar News
News August 26, 2025
అంబేడ్కర్ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయండి:

అనంతపురం జిల్లాలో అంబేడ్కర్ గురుకుల డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మధు ప్రసాద్ ఏపీ అడిషనల్ సెక్రటరీ సునీల్ రాజ్ కుమార్‌ను కలిసి మంగళవారం వినతిపత్రం అందించారు. మధు మాట్లాడుతూ.. జిల్లాలో గురుకుల కళాశాల ఏర్పాటు, వంట వర్కర్ల జీతాలు, టెండర్ల విషయం, గురుకుల పాఠశాలలో సమస్యలపై చర్చించినట్లు తెలిపారు. జేఏసీ నాయకులు చిరంజీవి, వెంకి, నాగరాజు పాల్గొన్నారు.
News August 26, 2025
బార్ లైసెన్స్ అప్లికేషన్లు.. 29 వరకు ఛాన్స్

AP: బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువును ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. వినాయక చవితి, బ్యాంకు సెలవుల దృష్ట్యా గడువు పొడిగించినట్లు తెలిపింది. గడువు పెంపుపై విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించింది. బార్ లైసెన్సులకు ఈ నెల 30న ఉ. 8 గం.కు లాటరీ తీయనున్నారు. కాగా బార్లకు ఇచ్చే మద్యంపై పన్ను, ఒక్కో బార్‌కు నాలుగు దరఖాస్తులు తప్పనిసరనే నిబంధనలతో తక్కువ దరఖాస్తులు వస్తున్నట్లు సమాచారం.
News August 26, 2025
ప్రతి పాఠశాలలో స్కౌట్ యూనిట్ తప్పనిసరి: DEO

పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్‌ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని DEO సుబ్రహ్మణ్యం సూచించారు. రాయచోటిలోని డైట్ నందు మంగళవారం పాఠశాలల ప్రిన్సిపల్స్, ప్రధానోపాధ్యాయులు, యూనిట్ లీడర్లకు శిక్షణ ఇచ్చారు. జిల్లాలోని 39 పీఎం పాఠశాలల్లో స్కౌట్ కార్యకలాపాల కోసం సమగ్ర శిక్ష ద్వారా కేటాయించిన రూ.50 వేలను నిబంధనల ప్రకారం ఖర్చు చేయాలన్నారు.