News January 11, 2026

నేషనల్ అథారిటీ కాంపాలో ఉద్యోగాలు

image

నేషనల్ కాంపెన్సేటరీ అపారెస్టేషన్ ఫండ్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ(నేషనల్ అథారిటీ <>కాంపా<<>>) 8 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సంబంధిత విభాగంలో పీజీ అర్హతగల వారు జనవరి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://moef.gov.in/

Similar News

News February 19, 2026

బెండలో పేనుబంక వల్ల కలిగే నష్టాలేమిటి?

image

బెండ పంటను పేనుబంక పురుగులు ఆశిస్తే ఆకులు, రెమ్మల నుంచి రసాన్ని పీల్చేస్తాయి. దీని వల్ల మొక్కల ఎదుగుదలపై ప్రభావం పడి దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ఈ పేనుబంక పురుగులు ఆకులపై తేనె వంటి జిగురు పదార్థాన్ని స్రవిస్తాయి. దీని వల్ల నల్లటి బూజు తెగులు ఆశిస్తుంది. ఫలితంగా కిరణజన్య సంయోగక్రియకు అంతరాయం కలుగుతుంది. పేనుబంక తీవ్రత ఎక్కువగా ఉంటే ఆకులు ముడుచుకుపోయి, మొక్కలు బలహీనపడి చనిపోయే అవకాశం ఉంది.

News February 19, 2026

IRCON ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>IRCON <<>>ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ 13 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గలవారు మార్చి 13 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech (సివిల్, EE, EEE, ECE, EIE)అర్హతతో పాటు పనిఅనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ircon.org.

News February 19, 2026

స్నానం చేసే నీళ్లలో కాస్త రాళ్ల ఉప్పు వేస్తే..

image

రాళ్ల ఉప్పులో శుద్ధి చేసే గుణం ఉంటుంది. స్నానం చేసే నీటిలో కొంచెం ఉప్పు వేసుకుంటే శరీరానికి అంటుకున్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. శాస్త్రీయ పరంగా.. ఉప్పు నీటి స్నానంతో చర్మ సమస్యలు తగ్గుతాయి. కండరాల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మనసును తేలికపరుస్తుంది. రోజంతా అలసిపోయిన వారికి ఈ ప్రక్రియ మంచి నిద్రను, ఉత్సాహాన్ని ఇస్తుంది. దిష్టి/నరఘోష ఉన్నవారికి ఇది ఒక అద్భుతమైన పరిహారం.