News February 4, 2026
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్‌లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్( NITC)లో 9 కాంట్రాక్ట్ పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. దరఖాస్తును ఫిబ్రవరి 11వరకు rectnf@nitc.ac.in ఈమెయిల్‌కు సెండ్ చేయాలి. పోస్టును బట్టి డిగ్రీ, పీజీ(హార్టికల్చర్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ), BTech/PGDM/MBA, MCA, BSc(CS, IT)ఉత్తీర్ణతతో పాటు పనిఅనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://nitc.ac.in/
Similar News
News February 15, 2026
INDvsPAK: టాస్ గెలిచిన పాక్.. భారత్ బ్యాటింగ్

T20WCలో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. కొలంబో వేదికగా కాసేపట్లో INDతో జరగనున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ మ్యాచ్‌లోనూ ఇరు జట్ల కెప్టెన్లు సూర్య, సల్మాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు.
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య, హార్దిక్, దూబే, రింకు, అక్షర్, కుల్దీప్, వరుణ్, బుమ్రా
PAK: అయూబ్, ఫర్హాన్, సల్మాన్, బాబర్, నవాజ్, షాదాబ్, ఫహీమ్, ఉస్మాన్, షాహీన్, అబ్రార్, తారిఖ్
News February 15, 2026
ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు.. PTI ఆందోళన

అవినీతి కేసుల్లో జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ <<19124142>>తీవ్ర అనారోగ్యంతో<<>> బాధపడుతున్నట్లు PTI పార్టీ తెలిపింది. దీంతో అధికారులు ఆయనను జైలు నుంచి రహస్యంగా ఆస్పత్రికి తరలిస్తున్నారని, ఇది ఇమ్రాన్ ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని ఆరోపించింది. ఆయన ఫ్యామిలీ మెంబర్, పర్సనల్ డాక్టర్ల సమక్షంలో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసింది. ఇమ్రాన్ ఆరోగ్యం గురించి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని కోరింది.
News February 15, 2026
నమీబియాపై USA గెలుపు

T20WC: చెన్నైలో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో USA 31 పరుగులతో విజయం సాధించింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా ఆరంభంలో ధనాధన్ బ్యాటింగ్ చేసింది. 10 ఓవర్ల వరకు 9కి పైగానే రన్‌రేట్ మెయింటేన్ చేసింది. ఆపై వరుసగా వికెట్లు కోల్పోయి విజయానికి దూరమైంది. చివరకు 6 వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద ఆగిపోయింది. ఈ ఓటమితో నమీబియా టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.


