News January 12, 2026
నేషనల్ కెమికల్ లాబోరేటరీలో ఉద్యోగాలు

CSIR-నేషనల్ కెమికల్ లాబోరేటరీలో 34 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ITI, BSc, డిప్లొమా, B.Lib.Sc.ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్టింగ్, ట్రేడ్‌టెస్ట్, రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.ncl-india.org
Similar News
News February 18, 2026
మదనపల్లె హత్యాచార ఘటన.. నిందితుడి తల్లి పాత్ర ఉందని ఆరోపణ!

AP: మదనపల్లెలో బాలికపై <<19173027>>హత్యాచారం<<>> వెనుక నిందితుడు కులవర్ధన్ తల్లి పాత్ర కూడా ఉందని బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. కులవర్ధన్‌కు మద్దతుగా కొందరు తమపై దాడి చేసేందుకు వచ్చారని, ఆ గ్యాంగ్‌ను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేశారు. వారంతా గంజాయికి బానిసై జులాయిగా తిరుగుతున్నారన్నారు. కులవర్ధన్ గతంలో వీధిలోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడని స్థానికులు ఆరోపించారు.
News February 18, 2026
ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్తత

AP: విశాఖ AUలో ఉద్రిక్తత నెలకొంది. SFIకి వ్యతిరేకంగా ABVP కార్యకర్తలు నినాదాలు చేస్తూ VC ఆఫీసులోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇదే టైమ్‌లో SFI నేతలు అక్కడికి వచ్చి ప్రతినినాదాలు చేయడంతో తోపులాట జరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. క్యాంపస్‌లోకి బయటి వ్యక్తులు రాకుండా మెయిన్ గేటుకు తాళాలు వేశారు. AUలో నిన్న RSS మార్చ్‌ను SFI అడ్డుకున్న నేపథ్యంలో వివాదం ఏర్పడింది.
News February 18, 2026
క్లీనింగ్ టిప్స్ మీ కోసం..

* ముత్యాల నగలు మురికిగా అయితే ఆలివ్ నూనెలో ముంచిన దూదితో తుడవండి.
* బట్టలపై నూనె పడితే ఉప్పు అద్దిన నిమ్మకాయతో రుద్దండి.
* షవర్ రంధ్రాలు మూసుకుపోతే, వైట్ వెనిగర్‌తో శుభ్రం చేసుకోవచ్చు.
* ఫ్రిజ్ లోపల దుర్వాసన వస్తోంటే వంటసోడాలో కాసిని నీళ్ళు కలిపి తుడిస్తే సరిపోతుంది.
* బొద్దింకలు తిరిగే ప్రాంతాల్లో కీరదోసను ముక్కలుగా కోసి పెడితే, వాటి బెడద తగ్గుతుంది.


