News February 13, 2025
నేషనల్ మెరిట్ స్కాలర్షిప్‌కు వేమనపల్లి విద్యార్థిని ఎంపిక

నీల్వాయికి చెందిన 8వ తరగతి విద్యార్థిని నేహస్విత ఇటీవల నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్షిప్ పోటీ పరీక్ష రాసి ఎంపికైంది. నీల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి వరుసగా విద్యార్థులు NMMSకు ఎంపిక కావడం విశేషం. ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ వస్తుంది. ఉపాధ్యాయులు బృందం మరియు తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.
Similar News
News March 3, 2026
చంద్రగ్రహణమైనా ఈ ఆలయాలు తెరిచే ఉంటాయి!

చంద్రగ్రహణం వల్ల ఈరోజు దేశంలోని ఆలయాలు మూతపడినా కొన్ని మాత్రం తెరిచే ఉంటాయి. ఏపీలో శ్రీకాళహస్తి ఈ జాబితా ఉండగా, తమిళనాడులో అరుణాచలేశ్వర ఆలయం ఉంది. కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ ఆలయం, కేరళలోని తిరువరప్పు శ్రీకృష్ణ ఆలయం కూడా ఈరోజు తెరిచే ఉంటాయి. ఇక ఉత్తరాదిలో మహాకాళేశ్వర్ (ఎంపీ), కల్కాజీ దేవి (ఢిల్లీ), విష్ణుపద్ (బిహార్), లక్ష్మీనాథ్ టెంపుల్ (RJ), కల్పేశ్వర్ (UKD) ఆలయాలు ఈరోజు తెరిచే ఉంటాయి.
News March 3, 2026
కామారెడ్డి: ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో ఉద్యోగ అవకాశాలు

కామారెడ్డిలోని ప్రణామ్ డే కేర్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నియమకాలు చేపట్టనున్నట్లు జిల్లా మహిళలు, పిల్లలు, దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ జిల్లా అధికారులు తెలిపారు. సెంటర్‌లో పని చేయడానికి సూపరింటెండెంట్, పార్ట్ టైం ఆరోగ్య సిబ్బంది ఇతర ఉద్యోగాలకు, పదో తరగతి చదివి ఆసక్తి కలిగిన వారు ఈ నెల 13వ తేదీ లోపు జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News March 3, 2026
చరిత్రలో ఈరోజు (మార్చి 3)

1839: టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషేడ్జీ టాటా జననం
1937: రచయిత సత్యం శంకరమంచి జననం
1967: సింగర్ శంకర్ మహదేవన్ జననం
1969: సినీ నటి మధుబాలా జననం
2002: పార్లమెంటు తొలి దళిత స్పీకర్ బాలయోగి మరణం
2003: MRF వ్యవస్థాపకుడు కేఎం మామ్మెన్ మాపిళ్లై మరణం
2008: తెలుగు సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన తొలి నటి నగరాజకుమారి మరణం.


