News December 27, 2025
నేషనల్ వాటర్ పోలో పోటీలకు సంగారెడ్డి విద్యార్థి

జాతీయస్థాయి వాటర్ పోలో పోటీలకు సంగారెడ్డికి చెందిన మహమ్మద్ రెహమాన్ ఎంపికయ్యారు. ఈ నెల 27 నుండి 29 వరకు హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి స్విమ్మింగ్, వాటర్ పోలో పోటీలలో ఆయన పాల్గొంటారని రాష్ట్ర కార్యదర్శి ఉమేష్ శుక్రవారం తెలిపారు. రెహమాన్ జాతీయస్థాయిలోనూ రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఆకాంక్షించారు.
Similar News
News December 28, 2025
జడ్చర్ల: ట్రాక్టర్ కిందపడి ఐదేళ్ల బాలుడు మృతి

జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామంలో ఆదివారం విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన అల్లాపురం ఆంజనేయులు కుమారుడు మణిదీప్(5) ఆగి ఉన్న ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయడంతో, అది అకస్మాత్తుగా కదలడంతో ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. ట్రాక్టర్ టైరు బాలుడిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మరణించాడు. కళ్లముందే కుమారుడు విగతజీవిగా పడి ఉండటంతో తల్లిదండ్రుల రోదనలు గ్రామస్థులను కలిచివేశాయి.
News December 28, 2025
50 మందికి పైగా దుర్మరణం.. సిగాచీ CEO అరెస్ట్

TG: సిగాచీ కంపెనీ CEO అమిత్‌రాజ్‌ను పటాన్‌చెరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఏడాది జూన్‌లో సంగారెడ్డి(D) పాశమైలారంలోని సిగాచీ కంపెనీలో భారీ పేలుడు సంభవించి 50 మందికి పైగా కార్మికులు మరణించారు. దీంతో ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా నిన్న రాత్రి CEOను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అటు బాధితులకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని యాజమాన్యాన్ని హైకోర్టు ఇప్పటికే ఆదేశించింది.
News December 28, 2025
ప.గో: సోమవారం ప్రజా సమస్యల వేదిక ఎక్కడంటే..

ప్రజా సమస్యల పరిష్కార వేదికను భీమవరం వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా భీమవరానికి మార్చినట్లు పేర్కొన్నారు. అర్జీదారులు ఈ మార్పును గమనించి, తమ ఫిర్యాదులను వన్‌టౌన్ స్టేషన్‌లో అందజేయాలని ఎస్పీ సూచించారు.


