News November 5, 2025

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌లో ఉద్యోగాలు

image

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్‌( NHSRC) 4 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 11 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, MBA, MBBS, BDS, నర్సింగ్, BHMS, BAMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: nhsrcindia.org/

Similar News

News March 6, 2026

GenZ: తరం మారినా.. మగాళ్లదే పెత్తనమట!

image

GenZలు అనగానే అడ్వాన్స్‌గా థింక్ చేస్తారనుకుంటాం. కానీ ఈ జనరేషన్‌ పురుషులు ఆడవాళ్ల విషయంలో ఇంకా సంప్రదాయంగానే ఉన్నారనే విషయం బయటపడింది. ప్రతిముగ్గురిలో ఒకరు భార్య తమ భర్త మాట వినాలని కోరుకుంటున్నట్లు లండన్ కింగ్స్ కాలేజ్ స్టడీలో తేలింది. కీలక విషయాల్లో భర్త నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారు. ఈ విషయాల్లో వీళ్ల కంటే పాతతరమే మెరుగ్గా ఉండడం గమనార్హం. బ్రిటన్, USA, ఇండియా సహా పలు దేశాల్లో సర్వే చేశారు.

News March 6, 2026

హాట్ టాపిక్‌గా విజయ్-త్రిష వ్యవహారం!

image

TVK ఛీప్ విజయ్ త్రిషతో కలిసి కనిపించడంతో ఎక్కడ చూసినా ఆమె పేరే వినిపిస్తోంది. విజయ్ భార్య చేసిన ఆరోపణల్లో నిజం ఉందని.. విజయ్ <<19306972>>త్రిషతో<<>> జీవితాన్ని పంచుకునే అవకాశం ఉందని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే 2015లోనే త్రిషకు చెన్నైకి చెందిన వరుణ్ అనే వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ అయింది. ఆ తర్వాత 5 నెలలకే దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. అంతకుముందు రానా దగ్గుబాటితో డేటింగ్ చేసినట్లు వార్తలొచ్చాయి.

News March 6, 2026

యుద్ధం.. 200 మంది చిన్నారులు మృతి!

image

మిడిల్ ఈస్ట్‌లో జరుగుతున్న యుద్ధంలో ఇప్పటి వరకు <<19305543>>1,230<<>> మందికి పైగా మరణించారు. వీరిలో దాదాపు 200 మంది చిన్నారులు ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇరాన్‌లో అత్యధికంగా 181, లెబనాన్‌లో 7, ఇజ్రాయెల్‌లో 3, కువైట్‌లో ఒకరు మృతి చెందినట్లు UNICEF వెల్లడించింది. FEB 28న ఇరాన్‌లో స్కూల్‌పై జరిగిన దాడిలో 168 మంది అమ్మాయిలు చనిపోయిన విషయం తెలిసిందే. దేశాల యుద్ధ కాంక్షకు పసి ప్రాణాలు గాల్లో కలిసిపోతుండటం బాధాకరం.