News February 28, 2025
నైపుణ్యాల హబ్‌గా తెలంగాణ: శ్రీధర్ బాబు

హైదరాబాద్‌లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గ్లోబల్ డెలివరీ సెంటర్ ను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. కొత్త క్యాంపస్ ద్వారా 5,000 ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. తెలంగాణను నైపుణ్యాల హబ్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఇందులో భాగంగా స్కిల్ యూనివర్సిటీ స్థాపించామన్నారు. హెచ్‌సీఎల్ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు.
Similar News
News December 18, 2025
ADB: UPSCలో సత్తా చాటిన జిల్లా యువకుడు

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)లో ఆదిలాబాద్ జిల్లా యువకుడు నోముల సాయి కిరణ్ 82వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. తాంసి మండలం పొన్నారి గ్రామానికి చెందిన నోముల అనసూయ-గంగన్నల కుమారుడు సాయి కిరణ్ ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (IES) సాధించాడు. పలువురు సాయి కిరణ్‌కు అభినందిస్తున్నారు.
News December 18, 2025
ఫలితాలు విడుదల

TG: గ్రూప్-3 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1,370 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరిగిన సంగతి తెలిసిందే. ఒక పోస్ట్ వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపింది. మరో 17 పోస్టుల వివరాలు త్వరలో వెల్లడిస్తామంది. లిస్ట్ కోసం ఇక్కడ <
News December 18, 2025
మెదక్ జిల్లాలో మొత్తం పోలింగ్ 89.30 %

మెదక్ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 89.30 % పోలింగ్ నమోదైంది. 21 మండలాలు, 492 పంచాయతీల్లో ఎన్నికలు జరగ్గా.. మొత్తం 4,98,152 మంది ఓటర్లకు 4,44,842 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,39,339లో 2,15,602 మంది, మహిళలు 2,58,806లో 2,29,235 మంది, ఇతరులు ఏడుగురిలో 5 మంది ఓటు వేశారు.


