News February 13, 2026

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్‌(NLCIL) 8 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, మైనింగ్ ఇంజినీరింగ్ అర్హత గలవారు FEB 16 నుంచి మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. Jr. ఓవర్‌మెన్‌కు పే స్కేల్ రూ.31K-రూ.లక్ష, మైనింగ్ సిర్దార్‌కు రూ.26K-రూ.1,10,000. సైట్: www.nlcindia.in

Similar News

News February 15, 2026

AIIMS కల్యాణిలో 137 పోస్టులు

image

AIIMS కల్యాణి 137 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS/DNB/MSc/PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. మార్చి 3,5,6 తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://aiimskalyani.edu.in

News February 15, 2026

టోల్ వసూలు రూల్స్‌లో మార్పులు.. నేటి నుంచే!

image

నేషనల్ ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ వసూలు రూల్స్‌లో కేంద్రం మార్పులు చేసింది. ఇకపై పూర్తిగా అందుబాటులోకి రాని ఎక్స్‌ప్రెస్ వేల్లో మొత్తం టోల్ కట్టాల్సిన అవసరం ఉండదు. పనులు పూర్తయిన మేరకే ఛార్జీలు వసూలు చేస్తారు. ఇది నేటి నుంచే అమల్లోకి రానుంది. దీంతో కొంత భాగమే ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్ వేలపై టోల్ భారం తగ్గనుంది. ప్రస్తుతం నేషనల్ హైవేలతో పోలిస్తే ఎక్స్‌ప్రెస్ వేలపై 25% ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

News February 15, 2026

స్పీకర్ తర్వాత ‘ఎన్నికల కమిషనర్’.. అభిశంసనకు సిద్ధమైన విపక్షాలు

image

CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఇండీ కూటమి సిద్ధమైనట్లు సమాచారం. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ఇచ్చిన విపక్షాలు ఇప్పుడు ఏకకాలంలో ఇద్దరు రాజ్యాంగబద్ధమైన అధికారులను టార్గెట్ చేయడం పార్లమెంటరీ చరిత్రలో అరుదైన పరిణామం. మార్చి రెండో వారంలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ నోటీసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. BJPకి అనుకూలంగా CEC వ్యవహరిస్తున్నారనేది ఆరోపణ.