News June 5, 2024
నోటాకు ఎన్ని ఓట్లంటే?
లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ,భువనగిరి పార్లమెంట్ స్థానాల్లో నోటాకు వేలల్లో ఓట్లు పోలయ్యాయి. నల్గొండలో 6086 ఓట్లు పోలవగా భువనగిరిలో 4646 ఓట్లు పోలయ్యాయి. కాగా నల్గొండ కాంగ్రెస్ అభ్యర్ధి రఘువీర్ రెడ్డి 60.5% ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డిపై గెలుపొందారు. భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ 44.89% ఓట్లతో సమీప బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌పై గెలుపొందారు.
Similar News
News November 27, 2024
NLG: రేపటి డిగ్రీ పరీక్షలు యథాతధం
ఈ నెల 28 (గురువారం) నుంచి జరగాల్సిన డిగ్రీ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని మహాత్మా గాంధీ యూనివర్సిటీ సీఈవో డా.జి.ఉపేందర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఎటువంటి వదంతులను నమ్మవద్దని ఆయన సూచించారు. డిగ్రీ పరీక్షలకు విద్యార్థులంతా హాజరుకావాలని కోరారు.
News November 27, 2024
నల్లగొండ జిల్లాలో రెండు కొత్త మండలాలు
నల్లగొండ జిల్లాలోని గట్టుప్పల్, గుడిపల్లిలను మండల ప్రజాపరిషత్‌లుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది . కొత్తగా ఈ మండలాలకు ప్రజాపరిషత్ ఆఫీసులు ఏర్పాటు అవుతాయి. త్వరలోనే ఎంపీడీవో, ఎంపీవో, ఇతర సిబ్బంది నియామకం కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే జడ్పిటిసి, ఎంపీటీసీ, ఎంపీపీలు రానున్నారు.
News November 27, 2024
నల్గొండ రీజీయన్ RTCలో 102 కాంట్రాక్టు ఉద్యోగాలు
మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. నల్గొండ రీజీయన్‌లో 102 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT