News December 22, 2025

నోటి పూత ఎలా తగ్గించాలంటే?

image

విటమిన్ లోపం, వాతావరణ మార్పుల వల్ల నోటి పూత వేధిస్తుంది. ఇది సాధారణంగా 2వారాల్లో తగ్గిపోతుంది. సమస్య ఎక్కువైతే తేనె, కొబ్బరి, పాల పదార్థాలు తినాలని సూచిస్తున్నారు నిపుణులు. అలాగే ఉప్పునీటిని పుక్కిలించడం, తులసి ఆకులు నమలడం, చల్లటి నీటితో నోరు శుభ్రం చేసుకోవడం, లవంగం నమలడం వల్ల కూడా సమస్య తగ్గుతుంది. వీటితోపాటు విటమిన్ లోపాన్ని నివారించడానికి వైద్యులను సంప్రదించి మాత్రలు వాడాలని సూచిస్తున్నారు.

Similar News

News December 23, 2025

నల్గొండ: పీజీ పరీక్షల రీషెడ్యూల్ విడుదల

image

MGU పరిధిలోని పీజీ (MA, M.Com, M.Sc, MSW) మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల సవరించిన కాలపట్టికను వర్సిటీ విడుదల చేసింది. స్వల్ప మార్పులతో రూపొందించిన ఈ టైం టేబుల్‌ను పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్‌ ఉపేందర్ రెడ్డి ప్రకటించారు. ఈ పరీక్షలు జనవరి 20 నుంచి 31 వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలను వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని, విద్యార్థులు ఈ మార్పును గమనించాలని సూచించారు.

News December 23, 2025

కాంగ్రెస్‌కు మద్దతు తెలిపితే బెదిరిస్తారు: రాహుల్ గాంధీ

image

దేశంలోని సంస్థాగత వ్యవస్థలు BJP గుప్పిట్లో ఉన్నాయని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థపై జరిగిన దాడి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. జర్మనీలో ఉన్న ఆయన ఓ సభలో మాట్లాడారు. ‘ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, ED, CBIలు BJPకి ఆయుధాలుగా మారాయి. ఆ పార్టీ నేతలపై ED, CBI కేసులు లేవు. అదే ఓ వ్యాపారవేత్త కాంగ్రెస్‌కు మద్దతు తెలపాలనుకుంటే అతడిని బెదిరిస్తారు. BJP, ప్రతిపక్షం వద్ద ఉన్న డబ్బు చూడండి’ అని అన్నారు.

News December 23, 2025

ఆయిల్‌పామ్‌తో అధిక ఆదాయం.. సాగుకు సర్కారు ప్రోత్సాహం

image

తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. దేశీయ అవసరాల కోసం ఈ పంట సాగుకు ప్రభుత్వాలు మంచి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. కేవలం పామాయిల్‌తోనే కాకుండా దానిలో పసుపు, అల్లం, మిర్చి, మొక్కజొన్న, అరటి, కోకో, మిరియాలు వంటి అంతర పంటలతో అదనపు ఆదాయం పొందొచ్చు. ఈ పంట సాగుకు AP, తెలంగాణ ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.