News December 15, 2025

నోట్లో యాసిడ్ పోస్తానని బెదిరించారు: నెల్లూరు మాజీ మేయర్

image

నెల్లూరు రూరల్ MLA కోటంరెడ్డిపై మాజీ మేయర్ స్రవంతి సంచలన ఆరోపణలు చేశారు. ‘నెల్లూరులో పోలీసులను సైతం బెదిరిస్తున్నారు. నన్ను పదవి నుంచి తొలగించ వద్దని కొందరు ఆందోళన చేశారు. దీంతో 33వ డివిజన్ కార్పొరేటర్ చేత కోటంరెడ్డి ఫోన్ చేయించారు. నాకు మద్దతుగా నిలిచిన 70 ఏళ్ల వృద్ధుడి నోట్లో యాసిడ్ పోస్తామని, నరుకుతామని బెదిరించారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఆమె స్పందించలేదు’ అని స్రవంతి చెప్పారు.

Similar News

News April 13, 2026

ఉదయం 6 గంటలకే ప్రత్యేక గ్రీవెన్స్‌లు : నెల్లూరు కలెక్టర్

image

ఈనెల 15వ తేదీ నుంచి క్షేత్రస్థాయిలో ఆయా మండల కేంద్రంలో ఉదయం 6 గంటలకే అధికారులతో కలిసి ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా స్పష్టం చేశారు. జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై PGRS కార్యక్రమాల్లో ఇచ్చిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి పరిష్కారం చూపాలని అన్నారు. పెన్షన్లు, రెవెన్యూ సంబంధించిన అర్జీలు ఎక్కువగా వస్తున్నాయన్నారు.

నెల్లూరులో ఎమ్మెల్సీ vs మంత్రి..!

image

నెల్లూరులో మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మధ్య వార్ హాట్ టాపిక్‌గా మారుతోంది. వైసీపీ సిటీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి వరుస ప్రెస్‌మీట్లతో మంత్రి నారాయణపై అవినీతి ఆరోపణలు చేశారు. స్మార్ట్ స్ట్రీట్, మొక్కల పెంపకంలో రూ.కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్నారు. దీనికి మంత్రి ఇప్పటి వరకు స్పందించలేదు. ఆయన అనుచరులే తిప్పికొడుతున్నారు. మంత్రి మౌనం ఎన్నిరోజులు అనేది ప్రశ్నార్థకం.