News April 20, 2024
నోట్ రాసి మహిళ సూసైడ్ అటెంప్ట్

అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్యకు యత్నించిన ఘటన బోనకల్ మండలంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోనకల్‌కు చెందిన బండి రచన తన భర్త బండి సురేష్ ఇటీవల ట్రైన్ ప్రమాదంలో మరణించాడు. అయితే గత కొద్ది రోజులుగా అత్తమామలు, బావ కలిసి తనను వేధిస్తున్నారంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతుంది.
Similar News
News December 14, 2025
ఖమ్మం జిల్లాలో ‘కిక్’ ఎక్కిస్తోన్న జీపీ ఎన్నికలు..!

ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. సర్పంచ్, వార్డు అభ్యర్థులు ఓటర్లకు మద్యం పంపిణీ చేస్తున్నారన్న ప్రచారం మధ్య, గత 13 రోజుల్లో వైరా డిపో నుంచి రూ. 130 కోట్ల విలువైన 1.59 లక్షల కేసుల మద్యం, 56 వేల కేసుల బీర్లు తరలించారు. ఎన్నికల పుణ్యమా అని రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగడంతో అటు వ్యాపారులకు, ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతోంది.
News December 13, 2025
ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకే ‘కల్చరల్ ఫెస్ట్’: ఛైర్మన్ శ్రీధర్

ఖమ్మం శ్రీచైతన్య కళాశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్-2025 వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఛైర్మన్ మల్లెంపాటి శ్రీధర్ అధ్యక్షత వహించగా, CBI మాజీ జేడీ VV లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈఉత్సవాలు ఒత్తిడిని తొలగించి, ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకేనని ఛైర్మన్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ప్రధాని నుంచి పురస్కారం అందుకున్న కళాశాల విద్యార్థిని పల్లవిని ఈ సందర్భంగా సత్కరించారు.
News December 13, 2025
పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించాలి: కలెక్టర్

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులు, పోలింగ్ సిబ్బందిని ఆదేశించారు. కామేపల్లిలో పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను శనివారం ఆకస్మికంగా సందర్శించారు. సామగ్రి పంపిణీ, ఏర్పాట్లను పర్యవేక్షించి, అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఎంపీడీవో రవీందర్, మండల స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్, MRO సుధాకర్ పాల్గొన్నారు.


