News February 25, 2025

నోడల్ ఆఫీసర్లదే కీలక పాత్ర: కలెక్టర్

image

ఈ నెల 27న జిల్లాలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించడంలో నోడల్ అధికారుల పాత్రే కీలకమని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లో నోడల్ ఆఫీసర్లతో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలో 77 పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

Similar News

News February 25, 2025

కంచికచర్ల: ప్రమాదంలో ఇద్దరి మృతి.. వివరాలివే..!

image

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద బైకు అదుపు తప్పి డి వైడర్ను ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు ఉయ్యూరు ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (25), కరిముల్లా(30),లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ఉయ్యూరుకు ద్విచక్ర వాహనంపై బయలుదేరి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

News February 25, 2025

విజయవాడ : వైసీపీ అధిష్ఠానం కీలక నిర్ణయం

image

వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడ భారతి నగర్‌లోని ఇటీవల ఓ బాడీ మసాజ్ సెంటర్లో వైసీపీ ఎస్టీ సంఘం నేత వడిత్య శంకర్ నాయక్ దొరికారు. ఆయన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. ఈ మేరకు సోమవారం రాత్రి ఆయనను వైసీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

News February 25, 2025

ఉంగుటూరు : వివాహితను వేధించిన వ్యక్తికి రిమాండ్

image

ఉంగుటూరు మండలంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వివాహితను లైంగికంగా వేధించిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి కథనం.. మండలంలోని గ్రామానికి చెందిన వివాహిత పెళ్లి వేడుక నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో కలపాల కిరణ్ అనే వ్యక్తి ఆమెను బలవంతంగా నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతరం ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

error: Content is protected !!