News February 9, 2026
‘నో ఫోన్ ఛాలెంజ్’.. మీ పిల్లలకూ విసరండి!

విద్యార్థులు ఫోన్లకు బానిసలవకుండా కేరళలోని కూతుపరంబ స్కూల్ టీచర్ అమృత ‘నో ఫోన్ ఛాలెంజ్’ ప్రారంభించారు. ఫోన్ ముట్టుకోని పిల్లలకు స్టిక్కర్లు, ఇతర వస్తువులను బహుమతిగా ఇవ్వడం మొదలుపెట్టారు. ఇది పిల్లల్లో సానుకూల పోటీని పెంచింది. మీరూ ఇంట్లో పిల్లలు ఫోన్ చూడకుండా ఉండేందుకు ఈ ఛాలెంజ్‌ను ట్రై చేయండి. రోజంతా ఫోన్ చూడకుంటే బహుమతి ఇస్తామని చెప్పండి. ఆ సమయాన్ని క్రియేటివ్ వర్క్స్‌పై ఉపయోగించేలా చూడండి.
Similar News
News February 9, 2026
ప్రెగ్నెన్సీలో ఐరన్ లెవల్స్ పెరగాలంటే?

ప్రెగ్నెన్సీలో ఐరన్ లెవల్స్ సరిగా లేకపోతే బిడ్డ ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో కొన్ని పదార్థాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. ఖర్జూరాలు, అంజీర్, బ్లాక్ రైజిన్స్, బీట్‌రూట్, ఉసిరి రసం, కొబ్బరి, బెల్లం లడ్డూలు, కొబ్బరినీరు, బాదంపప్పు, గుమ్మడిగింజలు, వేయించిన శనగలు, రాగులు, దానిమ్మగింజలు, పెసలు, నేరేడు పండ్లు డైట్‌లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
News February 9, 2026
ఎల్లుండి వరకు వైన్స్, బార్లు బంద్

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వైన్స్, బార్లు, కల్లు దుకాణాల బంద్ అమల్లోకి వచ్చింది. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలలో ఈ సాయంత్రం 5 గంటల నుంచి 11వ తేదీ పోలింగ్ ముగిసే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అటు ఫలితాలు వెల్లడయ్యే 13వ తేదీ కూడా బంద్ పాటించనున్నారు. ఈ నెల 11వ తేదీ ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి.
News February 9, 2026
మున్సి‘పోల్స్’కు ముగిసిన ప్రచారం

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. దీంతో 48 గంటల ముందే అన్ని రకాల ప్రచారాలపై SEC నిషేధం విధించింది. ర్యాలీలు, సభలు, ఊరేగింపులతో పాటు టీవీ, సినిమా, సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ ప్రచారాలపై ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే రెండేళ్ల జైలు శిక్ష/జరిమానా విధిస్తామని హెచ్చరించింది.


