News August 30, 2025

న్యాయంపూడి జంక్షన్ వద్ద యాక్సిడెంట్

image

నక్కపల్లి మండలంలోని న్యాయంపూడి హైవే జంక్షన్ వద్ద శనివారం రాత్రి కొబ్బరిలోడు ట్రాక్టర్‌ను వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ట్రాక్టర్ బోల్తా పడి ఎస్.రాయవరానికి చెందిన కర్రి వెంకట సూరి (45) అక్కడికక్కడే మృతి చెందాడని సీఐ కె.కుమారస్వామి చెప్పారు. మరో వ్యక్తి గాయపడగా ఆసుపత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేశామని సీఐ వెల్లడించారు.

Similar News

News August 31, 2025

నెల్లూరు జిల్లాలో ఆ బార్లు అన్నీ క్లోజ్..!

image

నూతన పాలసీ కింద నెల్లూరు జిల్లాలో 55 బార్లు ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చారు. 21షాపులకు మాత్రమే 94 అప్లికేషన్లు వచ్చాయి. నెల్లూరులో 15, కావలిలో 3, కందుకూరులో 3.. మొత్తం 21 బార్లను కొత్తవారికి లాటరీ ద్వారా కేటాయించారు. ఇవి కాకుండా జిల్లాలో ప్రస్తుతం 47 బార్లుకు లైసెన్స్ ముగిసింది. వీటిని నేటి రాత్రి నుంచి పూర్తిగా క్లోజ్ చేయనున్నారు. ఇకపై నెల్లూరు, కావలి, కందుకూరులోనే బార్లు అందుబాటులో ఉండనున్నాయి.

News August 31, 2025

ఏటీఎంలలో చోరీ.. యూపీ ముఠా అరెస్ట్: సీఐ

image

పరవాడ ప్రాంతాల్లో ఏటీఎంలలో చోరీలకు పాల్పడిన యూపీకి చెందిన ముగ్గురిని శనివారం అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. ఈనెల 27న నిందితులు పరవాడ,దేశపాత్రునిపాలెం ఏటీఎంలలో డూప్లికేట్ తాళాలతో సేఫ్ డోర్ తెరిచి డిస్పెన్సర్ డోర్ వద్ద స్టిక్కర్లు అతికించారు. కస్టమర్లు విత్ డ్రా చేసిన నగదు బయటకు రాకుండా అందులో ఉండిపోయింది. తర్వాత నిందితులు ఏటీఎంలలోకి ప్రవేశించి నగదు తీసుకున్నారు.

News August 31, 2025

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన!

image

TG: స్థానిక సంస్థల ఎన్నికలకు <<17568780>>సన్నాహకాలు<<>> మొదలయ్యాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కొందరు ఇప్పుడిప్పుడే పనులు స్టార్ట్ చేస్తుండగా, మరికొందరివి చివరి దశకు చేరుకున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే పథకానికి బ్రేక్ పడుతుందేమో? డబ్బులు రాకపోతే నిర్మాణమెలా? అన్న సందేహాలతో సతమతమవుతున్నారు. అయితే ఆందోళన అవసరం లేదని, ఎన్నికల తర్వాత కూడా పథకం కొనసాగుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.