News January 1, 2026

న్యూఇయర్ రిజల్యూషన్స్ తీసుకుంటున్నారా?

image

న్యూఇయర్ అనగానే కొత్త ఆశలు, సంతోషాలు. ఈ సందర్భంగా చాలామంది కొత్త తీర్మానాలు తీసుకుంటారు. కానీ ఆ దిశగా చేసే ప్రయత్నాలు నాలుగురోజులకే పరిమితం అవుతాయి. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలంటున్నారు మానసిక నిపుణులు. పట్టుదల ఉండాలేగానీ అనుకున్నవి సాధించడం కష్టమేం కాదు. స్లో అండ్ స్టడీ విన్స్ బాటలోనే పయనించాలి. ✍️ న్యూఇయర్ రిజల్యూషన్స్ టిప్స్ గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.

Similar News

News February 16, 2026

సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల

image

TG: సన్నవడ్లు పండించే రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్వింటాల్‌కు రూ.500 బోనస్ కోసం రూ.514.36 కోట్లు విడుదల చేసింది. వానాకాలం సీజన్‌లో సన్నాలు అమ్మిన 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ఈ బోనస్ అదనంగా లభించనుంది.

News February 16, 2026

హీరోయిన్ త్రిషకు బీజేపీ నేత క్షమాపణలు

image

హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన BJP నేత నాగేంద్రన్ క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆమె గురించి అలా మాట్లాడి ఉండకూడదని విచారం వ్యక్తం చేశారు. త్రిషతో ఉన్న అనుబంధం నుంచి బయటపడితేనే టీవీకే చీఫ్ విజయ్‌కు వాస్తవాలు తెలుస్తాయంటూ ఆయన ఇటీవల <<19157644>>వ్యాఖ్యానించిన<<>> విషయం తెలిసిందే. చట్టపరమైన చర్యలు తీసుకుంటానని త్రిష హెచ్చరించడంతో నాగేంద్రన్ దిగివచ్చారు.

News February 16, 2026

INDvsPAK.. రికార్డు బ్రేకింగ్ వ్యూస్!

image

కొలంబో వేదికగా IND-PAK మధ్య జరిగిన హైవోల్టేజ్ మ్యాచ్ రికార్డులు బ్రేక్ చేసింది. జియో హాట్‌స్టార్‌లో ఏకంగా 45.4 కోట్ల వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ వరల్డ్ కప్‌లో అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌ను అభిమానులు మొబైల్ ఫోన్స్, టీవీల్లో లైవ్ వీక్షించి ఆనందించారు. అలాగే INDvsUSA మ్యాచ్‌కు 26 కోట్లు, INDvsNAM మ్యాచ్‌కు 24 కోట్ల వ్యూస్ వచ్చాయి.