News October 7, 2024
న్యూజిలాండ్‌లో కొత్తగూడెం యువతికి మొదటి బహుమతి

న్యూజిలాండ్ ఆక్లాండ్‌లోని తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం త్రీ ఇంక్లైన్ కార్మిక ప్రాంతానికి చెందిన చంద్రగిరి రేఖ పేర్చిన బతుకమ్మకి మొదటి బహుమతి లభించింది. న్యూజిలాండ్‌లో స్థిరపడిన తెలంగాణ చెందిన మహిళ కుటుంబాలలు పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు.
Similar News
News September 16, 2025
ఖమ్మం: విదేశీ విద్యకు దరఖాస్తుల ఆహ్వానం

ఖమ్మం జిల్లాకు చెందిన బీసీ, ఈబీసీ విద్యార్థుల విదేశీ విద్య కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జ్యోతి తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరంలో విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి ఉన్నవారు ఈ నెల 24 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు, వారి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉండాలని పేర్కొన్నారు.
News September 16, 2025
ఖమ్మం: ఆమె ఆరోగ్యమే లక్ష్యం

మహిళల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ‘స్వస్త్ నారీ.. సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపటి నుంచి OCT 2 వరకు మహిళలకు ఆరోగ్యపరీక్షలు నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాలో 26 PHCలు, 4 UPHCలు ఉన్నాయి. వీటి పరిధిలో రోజుకు 10 క్యాంపుల చొప్పున 12రోజుల్లో 120 క్యాంపులను నిర్వహించనున్నారు. ఈ క్యాంపులో బీపీ, షుగర్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లకు స్క్రీనింగ్ చేయనున్నారు.
News September 16, 2025
హైవేల వల్ల భూములు విలువ పెరుగుతుంది: కలెక్టర్

గ్రీన్ ఫీల్డ్ హైవేకు సంబంధించిన రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్‌లతో కలిసి దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ సేకరణ సమస్యపై రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులకు అన్యాయం చేయాలని ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, హైవే రావడం వల్ల భూముల విలువ పెరుగుతుందన్నారు.