News December 31, 2024
న్యూయర్ వేడుకలకు గుంటూరు సర్వం సిద్ధం
ఉమ్మడి గుంటూరులో న్యూయర్ వేడుకలకు యువత సిద్ధమైంది. గతంతో పోలిస్తే ఈ వేడుకల్లో ఎంతో తేడా కనిపిస్తుంది. 10ఏళ్ల కిందట వరకు గ్రీటింగ్ కార్డ్స్ పంచుకుంటూ శుభాకంక్షలు తెలిపేవారు. హైటెక్ యుగంలో వాట్సాప్ ద్వారా విషెస్ తెలుపుకుంటున్నారు. రంగురంగుల లైట్లతో నగరం, పల్లెలు మెరిసిపోతుండగా ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి.
Similar News
News January 3, 2025
APలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదు: మంత్రి
APలో ఆరోగ్యశ్రీ ఎక్కడికీ పోలేదని.. ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతో మరింత మైరుగైన సేవలు అందించేలా రూపాంతరం చెందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏప్రిల్ 01 నుంచి నగదు రహిత చికిత్సల్లో హైబ్రిడ్ విధానం అమలవుతుందన్నారు. రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వైద్య సేవల ఖర్చును NTR వైద్య సేవ ట్రస్ట్ భరిస్తుందన్నారు.
News January 3, 2025
గుంటూరు: 106 మంది పాస్
గుంటూరులోని పోలీస్ పరేడ్ మైదానంలో కానిస్టేబుల్ మహిళా అభ్యర్థులకు శుక్రవారం పరుగు పోటీలను నిర్వహించారు. పరీక్షలకు 216 మంది మహిళా అభ్యర్థులు వచ్చారు. దేహధారుడ్య, పరుగు పోటీల్లో 106 మంది క్వాలిఫై అయినట్లు అధికారులకు తెలిపారు. పరుగు పోటీల నిర్వహణను ఎస్పీ సతీశ్ కుమార్ పరిశీలించారు. ఏఎస్పీలు సుప్రజ, హనుమంతు పాల్గొన్నారు.
News January 3, 2025
మంగళగిరి: డ్రోన్లతో సరికొత్త సేవలు
మంగళగిరిలో డ్రోన్లతో సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టారు. UPHC ఇందిరా నగర్ నుంచి AIIMS మంగళగిరికి గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం PAP స్మెర్ నమూనాలను డ్రోన్ సహాయంతో 2నిమిషాల్లో పంపించారు. వైద్య రంగంలో ఏపీ మరో మైలురాయిని అధిగమించిందని APMSIDC ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. డ్రోన్ సేవల పైలట్ ప్రాజెక్ట్‌ను ఆయన ప్రారంభించారు. AIIMS సిబ్బందిని, అధికారులను అభినందించారు.