News November 19, 2024
న్యూయార్క్ UNGA సమావేశాల్లో ఎంపీ బైరెడ్డి శబరి

న్యూయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్య సమితి సమావేశాల్లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తదితరులతో కలిసి ఆమె UNGA సమావేశాలకు హాజరయ్యారు. ఈ అసెంబ్లీ సెషన్‌లో భాగమైనందుకు సంతోషంగా ఉందని శబరి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా అక్కడ పాల్గొన్న ఫొటోలను నెట్టింట పోస్ట్ చేశారు. 79వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 వరకు జరుగుతాయి.
Similar News
News December 26, 2025
వీర్ బాల్ దివస్ వేడుకల్లో కర్నూలు కలెక్టర్ సిరి

బాలలకు సరైన అవకాశాలిస్తే అద్భుతాలు సృష్టిస్తారని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అన్నారు. ఢిల్లీలో జరిగిన ‘వీర్ బాల్ దివస్–2025’లో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. వీర్ బాల్ పురస్కారం అందుకున్న మద్దికెర మండలానికి చెందిన పారా అథ్లెట్ శివానిని కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. బాలల అభివృద్ధికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.
News December 26, 2025
మద్దికేర బాలికకు రాష్ట్రపతి చేతుల మీద అవార్డ్

మద్దికేర మండల కేంద్రానికి చెందిన ఉప్పర వీరప్ప, లలితల కుమార్తె శివాని శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారం అందుకున్నారు. జావెలిన్ త్రో, షాట్ పుట్‌లో నాలుగేళ్లుగా కనబరుస్తున్న ప్రతిభను గుర్తించి ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కొన్ని రోజులగా తల్లి అనారోగ్యంతో మృతి చెందినప్పటికీ పట్టు వదలకుండా ముందుకు వెళ్లడంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
News December 25, 2025
కర్నూలు: 9025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు: ఎస్పీ

రోడ్డు ప్రమాదాల నివారణకు కర్నూల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. 2025 జనవరి నుంచి డిసెంబర్ 20 వరకు 9,025 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామన్నారు. మద్యం తాగి వాహనం నడిపిన వారికి జరిమానాతో పాటు ఒక నెల జైలు శిక్ష విధించినట్లు చెప్పారు.


