News November 4, 2025

న్యూస్ అప్‌డేట్స్

image

* TG: 1,037 ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ G.O. జారీ. 2026 మార్చి 31 వరకు వారు విధుల్లో కొనసాగనున్నారు.
* తెలంగాణ విద్యార్థులకు జర్మనీ భాష నేర్పించేందుకు సహకరించాలని జర్మనీ కాన్సుల్ జనరల్‌ను కోరిన సీఎం రేవంత్
* సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులను సహించం: ఏపీ హోంమంత్రి అనిత
* మొక్కజొన్న కొనుగోళ్లు ప్రారంభించాలని TG సర్కార్ ఆదేశం

Similar News

News November 4, 2025

ప్రముఖ నటి కన్నుమూత

image

ప్రముఖ మరాఠీ నటి దయా డోంగ్రే(85) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తుదిశ్వాస విడిచారు. 16 ఏళ్లకే నాటక రంగంలోకి ఆమె ప్రవేశించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ తీసుకుని సీరియల్స్, సినిమాల్లో నటించారు. దూరదర్శన్‌లో వచ్చిన ‘గజరా’తో ఆమెకు గుర్తింపు వచ్చింది. ఆత్మవిశ్వాస్, మాయాబాప్, ఖత్యాల్ సాసు నాథల్ సూన్ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. అత్త పాత్రలకు కేరాఫ్ దయా అని చెబుతారు.

News November 4, 2025

చంద్రబాబు, లోకేశ్‌పై జగన్ సెటైర్లు

image

AP: తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన సందర్భంగా CM చంద్రబాబు, మంత్రి లోకేశ్‌పై YCP అధినేత జగన్ సెటైర్లు వేశారు. ‘ఇంత విపత్కర పరిస్థితిలో సీఎం ఒక రోజు వస్తాడు. అలా చాపర్‌లో తిరుగుతాడు. మరుసటి రోజు లండన్‌కు పోతాడు. ఆయన కొడుకు ఆస్ట్రేలియా నుంచి వస్తాడు. మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడటానికి పోతాడు’ అని ఎద్దేవా చేశారు. రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

News November 4, 2025

రేపు పలు జిల్లాలకు వర్షసూచన

image

AP: కోస్తా తీరానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీంతో రేపు కోనసీమ, కృష్ణా, GNT, బాపట్ల, ప్రకాశం, NLR, కర్నూలు, KDP, TPT జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వానలకు ఛాన్స్ ఉన్నట్లు వెల్లడించింది. ఇవాళ 5PM వరకు బాపట్లలో 61.5MM, నంద్యాల(D) నందికొట్కూరులో 51.7MM అధిక వర్షపాతం నమోదైనట్లు చెప్పింది.