News November 8, 2025
న్యూస్ అప్‌డేట్స్ 10@AM

* తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న A-16 అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు. భోలేబాబా కంపెనీకి కెమికల్స్ ఉన్న పామాయిల్ సప్లై చేసినట్లు గుర్తింపు
*తిరుపతి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన. పలమనేరులో కుంకీ ఏనుగుల క్యాంపును సందర్శించనున్న పవన్
*బిహార్ తొలి దశ పోలింగ్‌లో 65.08% ఓటింగ్ నమోదు: ఈసీ
*ఢిల్లీలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాని విమాన సర్వీసులు
Similar News
News April 2, 2026
‘Floccinaucinihilipilification’ అంటే ఏంటి?

నిర్మలా సీతారామన్‌పై దాఖలైన పరువు నష్టం దావాను కొట్టివేస్తూ ఢిల్లీ కోర్టు వాడిన ‘Floccinaucinihilipilification’ పదం ఇప్పుడు ట్రెండవుతోంది. 29 అక్షరాలున్న ఈ పదానికి ‘విలువలేనిది’ లేదా ‘నిరుపయోగమైనది’ అని అర్థం. ఆప్ నేత సోమనాథ్ భారతీ భార్య వేసిన ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని పేర్కొంటూ కోర్టు ఈ పదాన్ని వాడింది. పొడవుగా ఉండడం, పలకడానికి కష్టంగా ఉండడంతో రోజువారీ సంభాషణల్లో దీన్ని ఉపయోగించడం లేదు.
News April 2, 2026
అమరావతి బిల్లుకు BRS మద్దతు

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభలో BRS మద్దతు తెలిపింది. తమ పార్టీ ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకం కాదని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కేసీఆర్ స్వయంగా వెళ్లి రాజధాని శంకుస్థాపనలో పాల్గొన్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడిగా అభివృద్ధి కావాలని ఆకాంక్షించారు. తెలంగాణలోని ఒక సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు.
News April 2, 2026
ఎవరెస్ట్ ట్రెక్కింగ్‌లో భారీ స్కామ్.. ఎలా చేశారంటే?

ఎవరెస్ట్ పర్వతారోహణలో కొందరు షెర్పాలు, ఏజెన్సీలు రెస్క్యూ పేరుతో స్కామ్స్‌కు పాల్పడుతున్నట్లు తేలింది. ట్రెక్కర్ల ఆహారంలో కావాలనే బేకింగ్ సోడా అధికంగా వాడి వారిని అనారోగ్యానికి గురిచేస్తున్నట్లు నేపాల్ పోలీసులు తెలిపారు. అనంతరం రెస్క్యూ పేరిట వారిని హెలికాప్టర్లలో తరలిస్తూ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి మూడేళ్లలో రూ.180 కోట్లకు పైగా క్లెయిమ్ చేసినట్లు చెప్పారు. ఈ స్కామ్‌పై విచారణ కొనసాగుతోంది.


