News November 16, 2025

న్యూస్ అప్‌డేట్స్ @10AM

image

*ఛత్తీస్‌గఢ్‌ సుక్మా(D)లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
*తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
*ఈనెల 19 లేదా DEC 7న TGలో స్వయం సహాయ సంఘాల సభ్యురాళ్లకు ఉచిత చీరల పంపిణీ
*మరో ఆపరేషన్ సిందూర్ జరగకూడదని, IND-PAK రిలేషన్స్ మెరుగుపడాలని ఆశిస్తున్నానన్న J&K Ex CM ఫరూక్ అబ్దుల్లా

Similar News

News November 16, 2025

APPY NOW: జమ్మూ సెంట్రల్ వర్సిటీలో ఉద్యోగాలు

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూలో 5 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికే ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. లైబ్రేరియన్, డిప్యూటీ లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్, ఇంటర్నల్ ఆడిట్ ఆఫీసర్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తు ఫీజు రూ.1000. వెబ్‌సైట్: https://cujammu.ac.in/

News November 16, 2025

మరోసారి బిహార్ CMగా నితీశ్‌!

image

జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ మరోసారి బిహార్ CMగా కొనసాగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 19 లేదా 20న ప్రమాణస్వీకారం చేసే అవకాశముంది. PM మోదీ షెడ్యూల్‌ బట్టి తుది తేదీ నిర్ణయించనున్నారు. 89 సీట్లు గెలిచిన బీజేపీకి 15/16, 85 స్థానాల్లో విజయం సాధించిన JDUకు 14, లోక్ జన్‌శక్తి పార్టీకి 3 చొప్పున మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. కాగా నితీశ్ ఇప్పటివరకు 9 సార్లు CMగా ప్రమాణం చేశారు. 20 ఏళ్లు పదవిలో ఉన్నారు.

News November 16, 2025

పొద్దుతిరుగుడు సాగు – విత్తన శుద్ధితో మేలు

image

ఏ పంటకైనా చీడపీడల ముప్పు తగ్గాలంటే విత్తే ముందు విత్తనశుద్ధి తప్పకుండా చేయాలి. పొద్దుతిరుగుడు పంటకు నెక్రోసిస్ వైరస్ తెగులు సమస్యను అధిగమించడానికి కిలో విత్తనానికి 3 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 5ml ఇమిడాక్లోప్రిడ్‌తో విత్తనశుద్ధి చేయాలి. అలాగే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కిలో విత్తనానికి 2 గ్రా. ఇప్రోడియాన్ 25%+కార్బండాజిమ్ 25%తో విత్తనశుద్ధి చేసుకుంటే మంచిది.