News December 14, 2025
న్యూస్ అప్‌డేట్స్

✦ ‘పాలమూరు’ ఫేజ్-1కి అనుమతులు ఇవ్వాలని, ఏపీ తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టు, కర్ణాటక ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని కేంద్రానికి మంత్రి ఉత్తమ్ లేఖ
✦ తిరుమలలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం.. నిన్న హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు
✦ తెలంగాణలో పురుషుల సగటు ఆయుర్దాయం (67) కంటే మహిళలదే (73) ఎక్కువ.. ‘శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్’ 2022 డేటా ఆధారంగా నివేదిక ఇచ్చిన కేరళ వర్సిటీ
Similar News
News December 14, 2025
కర్నూలు అభివృద్ధే నాకు ముఖ్యం: మంత్రి టీజీ భరత్

కర్నూలు అభివృద్ధి కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూల్లో టీడీపీ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తనకు కర్నూలు అభివృద్ధే తప్ప వేరే ఆలోచన లేదన్నారు. పార్టీ క్యాడర్ ప్రజల్లో ఉంటూ సమస్యలు గుర్తించి పరిష్కరించాలని ఆయన సూచించారు. తమ ప్రభుత్వం ఇలాగే కొనసాగితే అభివృద్ధి ఎంతో జరుగుతుందన్నారు.
News December 14, 2025
కనకాంబరం దిగుబడి పెరగాలంటే ఏం చేయాలి?

కనకాంబరం దిగుబడి పెరగాలంటే మొక్కలు పెరిగే తొలిదశలో కలుపు లేకుండా చూడాలి. వేసవిలో ఎండ తీవ్రతను తగ్గించడానికి అవిసె మొక్కలను పెంచితే పాక్షిక నీడ ఏర్పడి మొక్కలు బాగా పెరిగి అధిక పూల దిగుబడి వస్తుంది. పూలు కోయడం పూర్తైన తర్వాత పూల గుత్తులను, ఎండు కొమ్మలను తొలగిస్తే ఏడాది పొడవునా పువ్వులు పూసి దిగుబడి పెరుగుతుంది. కనకాంబరం పువ్వులను రోజు విడిచి రోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో కోయాలి.
News December 14, 2025
హెయిర్ డై మచ్చలు పోవట్లేదా?

అందంగా కనిపించాలనో, తెల్లవెంట్రుకలు దాయాలనో చాలామంది హెయిర్ డైలు వాడుతుంటారు. అయితే కొన్నిసార్లు వీటి మచ్చలు నుదురు, మెడ దగ్గర అంటి ఇబ్బంది పెడుతుంటాయి. అలాంటప్పుడు బేబీ ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్స్‌ను మచ్చలపై అప్లై చేసి కాసేపు రుద్ది కడిగేస్తే సరిపోతుంది. వెనిగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో రుద్దినా మచ్చలు తగ్గుతాయి. నిమ్మరసంలో కాస్త కొబ్బరినూనె కలిపి రాసినా ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.


