News December 3, 2025
న్యూస్ రౌండప్

☞ కర్నూలు, నంద్యాల జిల్లాల టాప్ హెడ్‌లైన్స్
★ కర్నూలు-బళ్లారి రోడ్డును NHగా మార్చాలని కేంద్ర మంత్రికి TG భరత్ వినతి
★ RU పరిధిలో బీఈడీ ఫలితాలు విడుదల
★ సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై 925 మందిపై కేసులు
★ ఆలూరుకు కలెక్టర్ వస్తే సమాచారం ఇవ్వరా?: ఎమ్మెల్యే విరూపాక్షి
★ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం: డీఈవో
★ కర్నూలు ఎంపీపీ పీఠం టీడీపీ కైవసం
★ శ్రీశైలంలో శివ స్వాముల రద్దీ
Similar News
News December 3, 2025
వనపర్తి: నిన్న ఒక్కరోజే 1,608 వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలు

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీల్లోని 850 వార్డులకు నిన్న ఒక్కరోజే 1,608 నామినేషన్లు దాఖలు అయ్యాయి. మండలాల వారీగా వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
✓ ఆత్మకూర్ మండలం – 250
✓ అమరచింత మండలం – 216
✓ కొత్తకోట మండలం – 392
✓ మదనాపూర్ మండలం – 299
✓ వనపర్తి మండలం – 451 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా మొత్తం వార్డు సభ్యుల నామినేషన్ల సంఖ్య 2,062కు చేరింది.
News December 3, 2025
వనపర్తి: నిన్న ఒక్కరోజే 442 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో రెండో విడతలో జరగనున్న 94 గ్రామ పంచాయతీలకు నిన్న ఒక్కరోజే 442 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ ఆత్మకూరు – 68 నామినేషన్లు.
✓ అమరచింత – 54 నామినేషన్లు.
✓ కొత్తకోట – 102 నామినేషన్లు.
✓ మదనాపురం – 82 నామినేషన్లు.
✓ వనపర్తి – 136 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా ఇప్పటివరకు 741 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు.
News December 3, 2025
భద్రాద్రి: ఆ గ్రామం ఎస్టీ రిజర్వ్‌డ్.. నామినేషన్లు నిల్

పాల్వంచ మండలంలోని పాండురంగాపురం పంచాయతీ సర్పంచ్ స్థానం ఎస్టీలకు రిజర్వు కాగా, నామినేషన్ల స్వీకరణకు ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఈ గ్రామంలో మొత్తం 1,202 మంది ఓటర్లు ఉన్నప్పటికీ, ఒక్క ఎస్టీ ఓటరు కూడా లేకపోవడమే ఇందుకు కారణం. సర్పంచ్‌తో పాటు 4 వార్డు స్థానాలు కూడా ఎస్టీలకు రిజర్వ్ అయ్యాయి. వెంటనే రిజర్వేషన్లను మార్చాలని గ్రామస్థులు కోరుతున్నారు.


